మకర సంక్రాంతి
సంక్రాంతి పండుగలో రెండవరోజు మనం జరుపుకొనేది "మకర సంక్రాంతి ". దీనినే మనం పెద్ద పండగ అంటాం . ఎందుకు అంటే గృహస్త ధర్మాలలో పితృ దేవతోపాసన ఒకటి . పుణ్యలోకాలకు ఏగిన మన పితృదేవతలను తలుస్తూ బ్రాహ్మణులకు గుమ్మడికాయ మొదలయినవి ,బియ్యం మొదలయిన సంభారాలతో స్వయం పాకాలు ఇవ్వడం అందుకే .
నిజానికి మనం జరుపుకొనే అన్ని పండుగలు చంద్రమానానుసారం జరుగుతాయి . కాని సంక్రాంతి మాత్రం సౌరమానానుసారం జరుగుతుంది . భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్య సంచారం మేషం,
వృష భం మొదలయిన 12 రాశులలో జరుగుతుంది . సంవత్సరం అంతా ఒక రాశి నుంచి మరో రాశికి మారును. ధనుస్సు రాశి నుంచి మకర రాశి లోకి మారటమే మకర సంక్రమణం . అదే మకర సంక్రాంతి గా మనం జరుపుతాము. అంతే కాదు ఆయన మార్పు కూడా జరుగుతుంది . ఇప్పటివరకు దక్షిణాయనంలో ఉన్న సూర్యుడు నేటినుంచి ఉత్తరాయణం లోనికి మారుతుంది . ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు భావిస్తారు. అందుకే మరి మహాభారత యుద్ధంలో అర్జునిని శర చాపానికి నేల కూలిన భీష్మ పితామహుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం అర్జునుడు నిర్మించిన ఆంప శయ్య మిద ఎదురుచుసాడు .
అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు .
మీ కాకినాడ కాజా

కామెంట్‌లు