రధసప్తమి వెనుక శాస్త్రీయ కోణం 2
సూర్యుడు ఒక్కో రాశి లోనూ లేదా ఒక్కో నెలలోను ముప్పై డిగ్రీలు చొప్పున మూడు వందల అరవై డిగ్రీలు పూర్తి చేయడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై అయిదు రోజులు పడుతుంది. అది భూమి సూర్యుని చుట్టూ
ఒకసారి భ్రమణం చేయడానికి పట్టే సమయంగా గుర్తించవచ్చును.
అంతే కాక సూర్యుడు దక్షిణాయనం నుంచి మకర సంక్రాంతి నాడు ఉత్తరాయణం లోకి ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి ఋతువులలో మార్పులు వస్తాయి. భూబ్రమణ ఫలితంగా సూర్యుడు దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరార్ధ గోళం వైపు కదలటం కన్పిస్తుంది. నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి. అందుకే రైతులు మరల తమ పొలం పనులలో నిమగ్నమయేందుకు సిధ్ధమవుతారు.
విజ్ఞానశాస్త్ర ప్రకారం చూస్తే సూర్యోదయ కాలంలో సూర్యుని ఎదురుగా నుంచుని స్నానం చేయడం వలన సౌరశక్తి లోని అతినీల లోహిత కిరణాలు మన శరీరంలో విటమిన్ "డి"
సంశ్లేషితమవుతుంది. లేత సూర్యకిరణాలలో సూర్య నమస్కారాలు చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం అదే.
జిల్లేడు, రేగు ఆకులకు సూర్యుని నుండి కాంతిని ఎక్కువగా గ్రహించే లక్షణం కలిగిఉంటాయి. వాటిని మన తలపై ఉంచుకొని స్నానం చెయటం వలన అవి గ్రహించిన సౌరశక్తి లోని కాస్మిక్ కిరణాలు మన శిరస్సు ద్వారా స్వీకరించే అవకాశం కలదు.
ఆవు పేడ పిడకలు మంట మండించటం , ఆవు పాలతో పాలు పొంగించటం అనేది సూక్ష్మ క్రిమి రహితంగా చేయడానికి. ఆవుపేడలో, పాలలో సూక్ష్మజీవి నాశకాలు ఉంటాయని.
ఈ విధంగా ఆలోచిస్తే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన చాలా ఆచారాలు, పూజా పునస్కారాల వెనుక శాస్త్రీయ దృక్పధం కనిపిస్తుంది. మామూలుగా చేయం కనుక దేముడు, పూజలు అని ఒక కారణాన్ని చూపించారేమో!.
మన దేశంలోని, రాష్ట్రం లోని ప్రముఖ సూర్యదేవాలయాల గురించి నా తదుపరి పోస్ట్ నందు చూడండి.