ముళ్ళు లేని గులాబీల తయారీ ఇలా....
కావలసిన వస్తువులు:
గులాబీ రంగు దళసరి కాగితం. ( నచ్చిన ఏ రంగుదైనా పరవాలేదు)
కత్తెర, గమ్ లేదా ఫెవికాల్ , వెదురు పుల్ల లేదా కొండ చీపురుపుల్ల
తయారీ విధానం:
ముందుగా కాగితాన్ని ముక్కలుగా కత్తిరించాలి.
వాటిని మడతపెట్టి మూడు సైజ్ లలో పత్రాకారంలో ముక్కలుగా కత్తిరించాలి.
పుల్లను తీసుకొని దానికి చివర అదే కాగితం ముక్కను ఇలా చుట్టి గమ్ తో అతికించాలి.
దాని చుట్టూ ముందు చిన్న రేకులు, తరువాత కొంచెం పెద్దవి, తరువాత బాగా పెద్దవి రేకులు అంటించుకొంటూ రావాలి.
ఆకులు ఆకారంలో కత్తిరించిన ఆకుపచ్చని కాగితాలు రెండు అతికిస్తే ముళ్ళు లేని గులాబీ రెడీ.
కామెంట్‌లు