గుర్తుకొస్తున్నాయి ........







సంక్రాంతి రంగ వల్లులు 

సంక్రాంతి వచ్చిందంటే నెలరోజుల ముందు నుంచి హడావిడే కదా! నెల   గంట మొదలయిన దగ్గర నుంచి ఆడపిల్లలకు ముగ్గులు రెడీ చేసుకోవటం ,ఏ రోజు ఏ ముగ్గు వెయ్యాలి ఎవరు వెయ్యని ముగ్గులు ఎక్కడ నుంచి సంపాదించాలి , ఎవరిదగ్గర నేర్చుకోవాలి అనే ఆరాటం ఉండేది. ముగ్గుల పుస్తకాలూ , నెట్ లో దొరికే రోజులు కాదు . పాత క్యాలెండరు వెనుక , పాట నోట్ పుస్తకాల వెనుక వేసుకొని ఉంచుకొనెవారు . వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సేకరించిన ముగ్గులు ఎప్పుడెప్పుడు ముంగిట్లో పరిచేద్దామా అని ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉండేవారు . ఇందులో మళ్ళి కొంతమంది ముగ్గుల స్పెషలిస్ట్లు  ఉండేవారు వారికి రాని ముగ్గులు లేవు . వాళ్ళకి చాల డిమాండ్ . ఆడపిల్లలు అందరు కాళీ సమయాల్లో అక్క,వదినా ,అత్తా,పిన్ని అంటూ వరసలు కలుపుతూ వాళ్ళ దగ్గర చేరి ముగ్గులు వేయటం నేర్చుకొనేవారు . నేర్పటం వాళ్లకి పెద్ద సరదాగా గొప్పగా ఉండేది . 
ముగ్గులు అంటే మామూలు ముగ్గులు కాదు ఒకరిని మించి ఒకరు వేయాలని తపన . పడుచు పిల్లలు ఆకాశంలో చుక్కల్ని తెచ్చి నేల మీద పరిచి వెండి వెన్నెల తీగల్ని ముగ్గులుగా కూర్చేవారు .చందమామని తెచ్చి బంతిపూల గొబ్బెమ్మలుగా మధ్యలో ఉంచేవారు . కొన్ని ముగ్గులు చూడండి  














ఎలా ఉన్నాయి . బాగున్నాయి కదూ . మీకూ గుర్తు వచ్చాయా ఆ రోజులు . 
మీ కాకినాడ కాజా 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం