బృందావన్ గార్డెన్స్.....


మైసూరు అనగానే అందరు బృందావన గార్డెన్స్ కి వెళ్ళారా అని అడుగు తారు. ఇది మైసూరు దగ్గర కావేరీ నది కి కట్టిన కృష్ణరాజసాగర్ అనే రిజర్వాయర్ పక్కన నిర్మించబడింది .   ఇదే బృందావన్ గార్డెన్స్ ముఖద్వారం . 




దీనిని మైసూరు మహారాజు కృష్ణరాజ వడయార్ వద్ద దివాన్ గా పనిచేసిన మీర్జా ఇస్మాయిల్  నిర్మించారు . 1927 నుండి మొదలుపెట్టి 1932 లో పూర్తి చేసారు . శిలా ఫలకం చూడండి . 



గార్డెన్స్ విహంగ వీక్షణం మ్యాప్ రూపంలో బోర్డ్ పెట్టారు . 


75 ఎకరాలలో నిర్మించిన ఈ గార్డెన్స్ ఎక్కడ చూసినా అందమైన ఉద్యాన వనాలు, గుబురు పొదలు, చక్కని లాన్ లతో హాయిగా సేద తీరేలా ఉంతుమ్ది. అందంగా తీర్చిదిద్దిన డిజైన్స్ తో రంగు రంగుల పువ్వుల మొక్కలతో చాలా అందంగా ఉంటుంది . గతంలో ఎన్నో వందల సినిమాలలో పాటలు ఇక్కడే చిత్రీకరించారు. 









ఇక్కడ మరో ప్రత్యేకత అనేక ఫౌంటేన్స్ ఇవి ఎప్పుడు నీటిని చిమ్ముతూ ఉంటాయి . ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉన్న మరో ప్రత్యేకత మ్యూజికల్ ఫౌంటేన్ సాయంత్రం చీకటి పడిన తరువాత ఇది స్పీకర్సు నుంచి వచ్చే సంగీతానికి అనుగుణంగా పైకి , కిందికి నీటిని చిమ్ముతూ ఉంటుంది . ఆ చిత్రాలను చూడండి . 



మ్యూజికల్ ఫౌంటేన్ కి దారి. నీళ్ళ మద్యనుంచి బ్రిడ్జి మీద దానిని చేరుకోవచ్చును.


చీకటి పడిన తరువాత దీపకాంతిలో కృష్ణరాజసాగర్ ఆనకట్ట 

మ్యూజికల్ ఫౌంటేన్ ఇదే.  ఆ సమయంలో ఎన్ని వందల కెమేరాలు ఫోటోలు తీస్తుంటాయో







తరువాత పోస్ట్ లో చాముండి హిల్స్ పైనున్న చాముండి ఆలయ విశేషాలు తెలుసుకుందాం . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం