యమ్. జి. రోడ్, కమర్షియల్ స్ట్రీట్

యమ్. జి. రోడ్   మొత్తం పుస్తకాల షాపులు , బట్టల షాపులతో నిండి ఉంటుంది . 


ఇక్కడ విదేశీ మారక ద్రవ్య లభిస్తుంది. ఇక్కడ మనం రకరకాల దేశాల కరెన్సీ ని మనకు కావలసిన దేశ కరెన్సీ గా మార్చుకోవచ్చును.

ఇక్కడ హైదరాబాదు లోని ఆబిడ్స్ , కోఠీ లలో ఉన్నట్లుగా అనిపిస్తుంది . పుట్ పాత్ ల పైన సెకండ్ హాండ్ పుస్తకాలు అమ్ముతున్నారు . ఏ పుస్తకమైనా 20 రూపాయలకే అంటు ఉన్న బోర్డ్ చూడండి.

ఇక్కడ ప్రముఖ కంపెనీల వస్త్ర దుకాణాలు కూడా  చాలా ఉన్నాయి .



గార్డెన్ సిటీ అన్నందుకు మొక్కల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటారు . రోడ్ మధ్యలో చెట్లు, మొక్కలు చాలా పెంచుతున్నారు. చిన్న చిన్న మొక్కలకు నీళ్ళు ఎక్కువ సేపు లభించడం కోసం దళసరి గోనె పట్టాలు చిల్లులు చేసి వాటి మధ్యలో మొక్కలు నాటడం లో వారి శ్రద్ధ కనపడుతోంది .

కమర్షియల్ స్ట్రీట్ కి వెళ్ళే దారిలో రెజిమెంట్ రోడ్ లో ఉన్న ఫైరింగ్ రేంజ్ ఇది .


కమర్షియల్ స్ట్రీట్ మాత్రం చూడగానే మనకు హైదరాబాద్ గుర్తుకు రాక తప్పాడు ఇరుకైన సందులలో రకరకాల చెప్పులు, బట్టలు, బాగ్లు , బొమ్మలు అమ్మే వివిధ దుకాణాలతో అచ్చం మన హైదరాబాద్ లోని కోఠీ ని గుర్తుచేసుకోవాలి .







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం