మాండ్య ది షుగర్ సిటీ



తరువాత ఒక ఇరవై కిలోమీటర్లు వెళితే మాండ్య వస్తుంది. దీనిని షుగర్ సిటీ అంటారు. ఇక్కడ ఎక్కువగా చెరుకు పండుతుంది. షుగర్ ఫాక్టరీ ఉంది. 




మరో ఇరవై రెండు కి,మీ వెళితే శ్రీరంగపట్నం వస్తుంది.  ఈ ఊరు మాండ్య జిల్లాలో ఉంది. దీనిని పూర్వం “శిరంగ్ పట్టణ “ అనేవారట.  నగరం అంతా కూడా కావేరి నదితో చుట్టబెట్ట బడి ఉంటుంది . ఒక ద్వీపం వలె ఉంటుంది.  ఇక్కడ శ్రీరంగనాధ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. రాజగోపురం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ ఆలయాన్ని గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర రాజులు సుందరంగా తీర్చిదిద్దారు.  ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడినది.

 ఆలయ గోపురాన్ని చూడండి
 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం