మండుటెండలో మంచు వర్షం


  
సాదారణంగా అందరూ మైసూర్ వెళితే అక్కడినుంచి  ఊటి వెళ్తారు. మైసూర్ కు సుమారు 180 కి.మీ దూరంలో   ఊటి ఉంది. అది ఇదివరకు చూడడంతో కొత్తది ఏదైనా ఊరు చూడాలని అనుకొన్నాము.  ఊటి దారిలో  సుమారు 1౦౦ కి. మీ వెళ్ళాక  కొంచెం పక్కకు వెళితే గోపాలస్వామి బెట్ట అని మంచి ప్రాంతంఉందని మా తమ్ముడు చెప్పడంతో మేము అక్కడికి బయలుదేరాం.  మైసూర్ నుంచి  ఊటి వెళ్ళేదారిలో సుమారు 1౦౦ కి.మీ దూరం వెళ్ళాము. 

నంజనగౌడ్ దాటిన తర్వాత గుండ్ల పేట్ అనే ఊరు వస్తుంది. ఆ ఊరు తర్వాత కుడి వైపుకి తిరిగితే గోపాలస్వామి బెట్ట దారి వస్తుంది.  అక్కడి నుంచి అడవి మొదలవుతుంది. 

ఇది రిజర్వ్ ఫారెస్టు .   చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేసి వుంటుంది. మేము అక్కడికి వెళ్లేసరికి  సుమారు  2 గంటలు అయింది అప్పటికి సూర్యుడు మండి పోతున్నాడు. ఆకాశం అంతా నీలంగా అసలు ఒక్క మబ్బు తునక కూడా లేకుండా ఉంది. రిజర్వ్ ఫారెస్టు  లోకి ప్రవేశించే చోట ఒక చెక్ పోస్టు  పెట్టారు. మేము అక్కడికి చేరేసరికి నెమ్మదిగా ఆకాశంలో మబ్బులు వేయడం మొదలైంది. ఇంతలో చిన్న చిన్న చినుకులు ప్రారంభమయాయి . 

గేట్ దగ్గరకు వెళ్లేం . అక్కడ ప్రతీ వెహికిల్ ను  చెక్ చేస్తారు. ప్లాస్టిక్ కవర్ల్ ,ప్లాస్టిక్ బాటిల్స్ , భోజనాలు ఏమీ తీసుకువెళ్ల కూడదు . అక్కడ మనం కొంత రుసుము చెల్లించి లోపలికి వెళ్ళాలి. మరలా ఒక రెండు గంటలలో తిరిగి వచ్చేయాలి.  




చెక్ పోస్ట్  దగ్గరకు వెళ్లి ఆగేలోపు వర్షం బాగా పెద్దదయింది. చెక్ చేయడానికి బయటకు రాలేనంతలా కుండపోతగా వాన కురిసింది. అంతేకాదు వాన కూడా మామూలు వాన కాదు చల్లటి మంచు కురిసినట్లుగా చల్లగా ఉంది. 

పెద్ద పెద్ద మెరుపులు , ఉరుములు తో కుండపోత వాన  ఆప్పటివరకు ఎండ తో విసిగి పోయి ఉన్నామేమో వెహికిల్ లో అందరికి వానలో దిగి తడవాలని పించింది . వెహికిల్ అద్దాలు  ముట్టుకొంటే చల్లగా అయిపోయింది.





మా అబ్బాయి, మిగిలిన పిల్లలు దిగి వానలో తడిసారు కూడా . చెక్ చేయించుకొని, రుసుము చెల్లించి బయలుదేరాం. అక్కడి నుంచి సుమారు 1 0 కి,మీ దూరం అంతా ఘాట్ రోడ్ మూడు కొండల పైనుంచి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళేకొద్దీ ఎత్తు పెరుగుతూ చివరకు గోపాలస్వామి బెట్ట చేరాము. 




అక్కడ గోపాలస్వామి గుడి తప్ప ఏమి ఉండదు. కాని మనం వెళ్ళడానికి  పడిన  ప్రయాస అంతా మర్చిపోతాము . అంత హాయిగా ఉంది చూడండి. మెట్లు ఎక్కుతుంటే పైన పడిన వర్షం కిందికి జారుతూ కాళ్ళను తడుపుతూ ఉంటే చల్లగా మంచులో కాళ్ళు పెట్టినట్లుగా ఉంది. చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు , అక్కడక్కడ పచ్చిక మేస్తూ జింకలు కనిపించాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం