విశ్వేశ్వరయ్య మ్యుజియం చూద్దాం

ఇది  బెర్నౌలి సూత్రం ప్రకారం పనిచేస్తుంది. దూరంగా ఉన్న బంతులు మద్యలోకి వేగంగా గాలిని పంపి నపుడు నిజానికి మరింత దూరం జరుగుతాయని అనుకొంటాము . కాని ఆ బంతులు రెండు మరింత దగ్గరకు జరుగుతాయి. ఇదే సూత్రం ఆధారంగా విమానాలు పనిచేస్తాయి. 


ఇన్ఫినిటి వెల్  అనగా అంతు లేని అగాధం అన్నమాట. నిజానికి ఇది ఒక అద్దం లా ఉంటుంది . పైన మనం చేత్తో రాయవచ్చును. కేవలం మన దృష్టి కి భ్రమ కలిగిస్తుంది .



ఇందులో కనిపించే ఆకారాలు మన కింద ఉన్న బటన్ నొక్కితే గుండ్రంగా తిరుగుతూ హైపెరబోలా , పెరాబోలా ఆకారాలు తయారవుతాయి .




కనిపించే టేబుల్ వెనుక గదిలా ఉంటుంది . అక్కడ నుంచి ఖాళీ లో తల పెడితే ప్లేట్ లో తల ఒకటే కనపడుతూ వింతగా అనిపిస్తుంది.




ఈ మేజిక్ వాటర్ టాప్ గాలిలో తేలుతూ ఒక టాప్ ఉంటుంది . దానికి పైపు కనెక్షన్స్ ఏమి ఉండదు కాని నీరు వస్తూ ఉంటుంది. అది చూడటానికి vimtaకలిగిస్తూ ఉంటుంది. దానినే మేము ఆకాశ గంగ పేరుతొ సైన్స్ ఫెయిర్ లో చాలా సంవత్సరాల క్రితం ప్రదర్శించాము. అది ఒక గాజు నాళికను చివర టాప్ ను ఉంచి ఆ నాళిక ద్వారా కింద నుంచి నీటిని పంపుతాము . అది పైకి వెళ్లి టాప్ ద్వారా పడుతున్నట్లు భ్రమ కలుగుతుంది.



ఇది ముఖద్వారం ఎదురుగా ఉండే విశ్వేశ్వరయ్య గారి విగ్రహం .
మరి ఇక్కడితో మ్యుజియం  చూడటం అయింది కదా మరిన్ని వివరాలు తదుపరి పోస్ట్ లలో చూడండి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం