చాముండి హిల్స్ విశేషాలు తెలుసుకుందాం




మైసూర్ నగరంలో ఉన్న కొండను చాముండి హిల్స్ అంటారు. ఈ కొండపై కొలువున్న చాముండేశ్వరి దేవి పేరుమీద ఈ కొండకు ఆ పేరు వచ్చింది. కన్నడలో ఈ కొండను చాముండి బెట్ట అంటారు. మనం కొండలను మెట్ట, మిట్ట అంటాము కదా అలాగ అన్నమాట . ఈ క్షేత్రం అష్టాదశ శక్తీ  పీఠములలో ఒకటైన క్రౌంచ పట్టణం ఇదే. ఇక్కడి చాముండేశ్వరి ని మహిషాసురమర్దని అని కూడా పిలుస్తారు. ఆ పేరు మీద మహిషుర్ అని పిలువబడి క్రమేపి మైసూర్ గా మారింది.
       ఈ కొండ సుమారు 1000మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కొండ దక్షిణ భారత దేశంలోని 8 పవిత్రమైన వాటిలో ఒకటి. ఈ  దేవాలయాన్నిమైసూర్ మహారాజులు బాగా తీర్చిదిద్దారు. ప్రతీ ఏడాది దసరాలకు ఇక్కడ జరిగే ఉత్సవాలు దేశవిదేశాలలో బాగా ప్రసిద్ధి చెందినది. అప్పుడు జరిగే ఉత్సవాలలో ఏనుగుపైన , రధంపైన , జరిపే ఊరేగింపులు కన్నుల పండువగా ఉంటాయి. మైసూర్ నగరమంతా పెట్టే విద్యుత్ దీపాలంకరణ చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఈ ఉత్సవాల సందర్భంగా మైసూర్ మహారాజులు దర్భార్ ను నిర్వహిస్తారు.  

                ఈ కొండపై మరో ఆకర్షణ 16 అడుగుల ఎత్తైన నంది విగ్రహం. ఇది చాలా అందంగా చెక్కబడింది. అయినా కర్ణాటక లో ఎక్కడ చూసినా నంది విగ్రహాలే ఎందుకంటే ఇక్కడి రాజులు అందరూ వీర శైవాన్ని బాగా ఆదరించారు కాబట్టి . 

ఇదే కొండపై మహిషాసురుని విగ్రహం కూడా ఉంటుంది. ఒకచేతితో పెద్ద కత్తిని, మరో చేతితో ఒక పామును పట్టుకొని ఉన్న ఆ విగ్రహం 

చూడవలసినదే. ఈ కొండపై నుండి చూస్తే నగరమంతా కనిపిస్తుంది. మైసూర్ మహారాజు పేలస్, లలిత మహల్ పేలస్ . రేసు కోర్స్ అన్ని చక్కగా కనిపిస్తాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం