ఇంటర్నేషనల్ జ్యువెలరి బాక్స్ - బేలూర్



బేలూర్ హోయసల రాజులకు చాలా కాలం రాజధానిగా ఉన్నది. ఇక్కడి ప్రత్యేకత చెన్నకేశవస్వామి దేవాలయం . ఇక్కడ ఆనాటి శిల్పులు చెక్కిన శిల్పాలు నేటికి చెక్కు చెదరక నిల్చి ఉన్నాయి. హోయసల రాజు విష్ణు వర్ధనుడు, రాణి శాంతల దేవి ఆధ్వర్యంలో నిర్మిచబడినది ఈ దేవాలయం. ఇక్కడి శిల్ప కళను చూడాలంటే రెండు కళ్ళు చాలవు .
మనకందరికీ అమరశిల్పి జక్కన కథ తెలుసు కదా. గొప్ప శిల్పి అయిన జక్కనచార్యునిచే ఈ దేవాలయం నిర్మించబడినది . ఈయన దేవాలయాన్ని, అందులోని వివిధ శిల్పాలను చెక్కడం కోసం ఇల్లు ,భార్య, పిల్లాడినివిడచి తయారుచేసే సమయానికి ఒక యువ శిల్పి వచ్చి ఎంతో శిల్ప నైపుణ్యం కలిగిన జక్కన చెక్కిన శిల్పంలో లోపం ఉందని అనగా జక్కన ఆగ్రహంతో లోపం ఉంటే తన కుడి చేతిని నరుకు కుంటానని నిరూపించమని సవాలు చేయగా పూర్తి అయిన విగ్రహాన్ని నాభి వద్ద ఉలితో కొట్టగా అక్కడ గుల్లగా శబ్దం వచ్చి దానినుండి ఒక కప్ప, కొద్దిగా నీరు బయటకు వస్తాయి. దానికి విస్మయం చెందిన జక్కనాచార్యుడు తన శపథం ప్రకారం తన కుడి చేతిని నరుకు కున్నాడు. ఇంతకీ ఆ యువ శిల్పి జక్కన కుమారుడు ధక్కనాచార్యుడే . ఆ విగ్రహాలను భూమిలో పాతిపెట్టి కొత్తగా ధక్కన ఆధ్వర్యంలో జక్కన విగ్రహాలను తయారు చేయిస్తాడు అవే నేడు పూజలు అందుకొంటున్న విగ్రహాలు. ముందు నమునా కోసం తయారు చేసిన గుడిని కూడా మనం ముఖ్య దేవాలయం పక్కన చూడవచ్చును .
దేవాలయాన్ని హోయసల శిల్పకలారితిలో నిర్మిచినా అది తరువాతికాలంలో వివిధ రాజులచే పూర్తి చేయబడటం చేత ద్రావిడ రీతిలో కట్టిన రాజగోపురం, రంగా మండపం ఉన్నాయి. లోపలి ప్రవేశించగానే కుడి వైపున ఒక తటాకం కూడా నిర్మించారు . ఈ దేవాలయం నక్షత్రకారంలో నిర్మించబడింది . దేవాలయ విశేషాలు తదుపరి పోస్ట్ నందు చూడండి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం