బెంగలూరు మెట్రో ట్రైన్

( ముందుగానే చెప్పినట్లు నేను వ్రాస్తున్న పోస్ట్ లోని వివరాలు ఎప్పుడు చూడని వాళ్ళ కోసం మాత్రమే అని గమనించవలసినదిగా కోరుతున్నాను .  )
సరే నిన్నటి వరకు సింగపూర్ చూసొచ్చాం కదా మళ్ళి బెంగలూర్ విశేషాలు చూద్దామా మరి . ఈ రోజు బెంగలూర్ లో మెట్రో ట్రైన్ ఎక్కి తిరుగుదామా ?. సరే కె . ఆర్ పురం రైల్వే స్టేషన్ దగ్గరలోనే బైఅప్పనహళ్లి మెట్రో స్టేషన్ ఉంది. ( కర్ణాటకలో హళ్లి పేరు ఎక్కువ వినిపిస్తుంది. హళ్లి అంటే పల్లె అనీ అర్ధం . చాలా గ్రామాలకు చివరన హళ్లి ఉంటుంది )
ఇదే బైప్పనహళ్లి మెట్రో స్టేషన్ . రండి లోపలికి . 
లోపలికి వెళ్ళగానే మన దగ్గర  సామానులు అన్నీ లగేజ్ స్కేనర్ లోనికి పంపి చెక్ చేస్తారు. మనని కూడా మెటల్ డిటెక్టర్ తో చెక్ చేస్తారు. 
అదుగో పైకి వెళ్లి టికెట్ తీసుకోవాలి. ఎస్కలేటర్ ఎక్కి పైకి పదండి . 
అదే టికెట్ కౌంటర్ . యం. జి. రోడ్ కి టికెట్ తీసుకొన్నాం. టికెట్ అంటే ప్లాస్టిక్ బిళ్ళలు ఇస్తారు . వాటిమీద మెట్రో సింబల్ ముద్రించి ఉంటుంది . అది ప్లాట్ ఫారం మీదకు వెళ్ళడానికి, ట్రైన్ దిగిన తరవాత బయటకు వెళ్ళేందుకు దారిని ఇచ్చే యంత్రాల దగ్గర ఉపయోగించాలి. 
ఇక్కడ ఉంచిన మేప్ లో మెట్రో ట్రైన్ మార్గం, ఎక్కడెక్కడ ఆగుతుంది. ఆ యా స్టేషన్స్ వివరాలు చూడగానే మనకు వివరంగా తెలిసేలా ఉంటాయి . ఇదే స్టేషన్ లోకి వెళ్ళే మార్గం. పదండి . 




లోపలికి వెళ్ళాలన్నా, బయటకు పోవాలన్నా కూడా వీటి మధ్య లోంచి వెళ్ళాలి. మనదగ్గర ఉన్న ప్లాస్టిక్ కాయిన్స్ ని ఈ యంత్రం మీద ప్రత్యేకించిన ప్రదేశంలో ఉంచాలి. అపుడు మార్గం విడుస్తుంది. మళ్లి మూసుకుపోతుంది.

ఎలా ఉంచాలో తెలిపే బోర్డ్ ఇది . 


పైన షెల్టర్ ఉన్న ఇదే ట్రైన్స్ వచ్చి ఆగే ప్లాట్ ఫారం . ఎంత పరిశుబ్రంగా ఉందో చూడండి . 



ట్రైన్ వస్తోంది చూడండి .


ప్లాట్ ఫారం పైన ఈ గీతలు గీసిన ప్రదేశానికి ఎదురుగా ట్రైన్ ద్వారం వస్తుంది.
ట్రైన్ లోపల అందరికి కనిపించేలా కంప్యుటర్ తెర మీద మనం ఉన్న స్టేషన్ , సమయం తెలుపు తుంది. రాబోయే స్టేషన్, ట్రైన్ ఎంత వరకు వెళ్తుంది మొదలైన వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది . పక్కన ఉన్న స్పీకర్స్ నుంచి కనడ, హింది, ఇంగ్లీష్ భాషల్లో చెప్తూ ఉంటారు  


 రైల్ లోపలి భాగంలో రెండు పక్కలా కూర్చోడానికి సీట్లు ఉన్నాయి. మద్యలో నించున్న వాళ్ళు పట్టుకోడానికి హేంగర్స్ ఉన్నాయి. సాదారణంగా నిల్చోనే అవసరం రాదు. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో వెంట వెంటనే ట్రైన్స్ వస్తాయి.

ఇదే ట్రైన్ లోపలిభాగం నాలుగు, అయిదు కంపార్ట్ మెంట్స్ అన్నీ ఒకదానికి ఒకటి కలుపు బడి ఉన్నాయి. అంత రద్దీగా ఏమి లేదు. బహుశా అది రద్దీ సమయం కాకపోవచ్చును.
 ఇది వికలాంగుల కోసం ప్రత్యేకించిన స్థలం . ఈ ట్రైన్ ప్లాట్ ఫారానికి దగ్గరగా, అదే ఎత్తులో ఉంటుంది కాబట్టి మెట్లు ఉండవు . వికలాంగులు వారి వీల్ చెయిర్స్ తో ఎక్కవచ్చును . ( కాని ట్రైన్ కు ప్లాట్ ఫారానికి ఇంకా కొంచెం ఎడం ఉంది కొద్దిగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.)
ట్రైన్ నుంచి కనిపించే బయటి దృశ్యాలు . ట్రైన్ ఎ. సి. కాబట్టి చక్కగా ప్రయాణించ వచ్చును . కుదుపులు ఉండవు . హాయిగా బయటకు చూస్తూ ఉండగానే మన గమ్యం చేరిపోతాము. బైఅప్పనహళ్లి నుంచి యం. జి రోడ్ నాకు రోడ్ మార్గం సుమారు 12 కిలోమిటర్స్ . ఆ దూరాన్ని రోడ్ పై వెళితే మామూల్ సమయంలో అరగంట , రద్దీ సమయంలో ఇంకా ఎక్కువ పట్ట వచ్చును. కాని మనం మెట్రో లో కేవలం పది నిమిషాలలో చేరుకొన్నాం.





య్ం. జి. రోడ్ ( మహాత్మా గాంధి మార్గ్ ) స్టేషన్ చేరుకొన్నాం . అక్కడ బయటకు వెళ్ళే మార్గంలో మళ్ళి ఒక యంత్రం ఉంటుంది . దానిలోనికి మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ కాయిన్స్ ( టికెట్ గా ఇచ్చినవి) వేయాలి . అపుడు మార్గం ఇస్తుంది. సరే బయటకు వచ్చాం. ఇదే యం. జి. రోడ్ మెట్రో స్టేషన్ పైనుంచి ట్రైన్ వెళుతుంది. 





మెట్రో ట్రైన్ లో విహరించారు కదా ! బాగుందా? 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం