విశ్వేశ్వరయ్య మ్యూజియం వింతలు చూద్దాం


భారత రత్న శ్రీ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీదగా నిర్మించ బడిన మ్యూజియం ఇది. ఇక్కడ ఒక ఆర్ట్ గాలరి కూడా ఉంది .


మ్యుజియం ప్రాంగణం లోకి ప్రవేశించగానే మనకు పెద్ద విమానం ఒక పక్కగా కనిపిస్తుంది .

ఇక్కడ సోలార్ పెనల్స్ , పాత కాలపు నీటితో పనిచేసే టర్బైన్ కనిపిస్తాయి .


ఈ మ్యుజియం ఏడు విభాగాలుగా ఉంటుంది. 
అవి 1 ఇంజన్ హాల్ . 2 ఎలాక్రానిక్స్ ౩. ఫన్ సైన్స్ 4. అంతరిక్ష విజ్ఞానము  5. బయోటెక్నాలజీ - పరిణామం . 6. బెల్ - హాల్ ( ఎలక్ట్రానిక్స్ ) 7 .సైన్స్ ఫర్ చిల్ద్రెన్ 
అంతే కాదు ఇక్కడ పిల్లలకు, పెద్దలకు వినోదాన్ని , విజ్ఞానము పంచే ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి . వాటిలో 1. నక్షత్ర దర్శనం 2. సైన్స్ కు సంబంధించిన నాటికల ప్రదర్శన. ౩ సైన్స్ క్విజ్ మొదలైన కార్యక్రమాలు జరుగుతుంటాయి . ఉపాద్యాయులు కోసం ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు .
ఇదే రైట్ సోదరులు మొదటి సారిగా ఆకాశం లో విహరించిన విమానం నమూనా .




రైట్ సోదరుల విమాన నమూనా చిత్రపటం ఇది.
 మొదటి విమానాల యొక్క చరిత్రను తెలిపే వివరాలు .

కింది భాగంలో ఉన్న ఇంజన్ హాల్ లో వివిధ పాత కాలపు డీజేల్ , పెట్రోల్ యంత్రాల నమూనాలు ఎన్నో ఉన్నాయి. 




ఇది పాత కాలపు ట్రక్ .
గ్రావిటీ ఆధారంగా పనిచేసే పరికరం ఇది ఒక మర  ను తిప్పుతుంటే బాల్స్ పైకి చేరి క్రమేపి కిందకు చేరడం మనం గమనించవచ్చును .

పురాతన కాలపు అచ్చు యంత్రం ఇది.

లెత్ యంత్రం






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం