షాపింగ్ మాల్ 2


ఏమిటీ నాలుగు రోజులు కనిపించలేదు అనుకొంటున్నారా . కర్నాటక ట్రిప్ లో బిజీ గా ఉండటం వలన మిమ్మల్ని కలవలేక పోయా . మీకోసం మరెన్నో విశేషాలను తీసుకువచ్చాను. అయితే ఇవన్నీ ఇంతకుముందు చూసిన వాళ్ళకోసం కాదు. వాళ్లకి ఇవి వింతగా, కొత్తగా అనిపించక పోవచ్చును. చూడనివాళ్ళకు విషయం తెలుస్తుందని , బాగుంటే చూడటానికి వెళ్ళినప్పుడు సమగ్రంగా తెలుస్తుందని చాలా వివరంగా వ్రాస్తున్నాను. సరే మరి షాపింగ్ మాల్ విషయాలు మరిన్ని తెలుసుకొందాం .

ఇది పిల్లలకు , పెద్దలకు కూడా చాలా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కల్గించేది . మనం సినిమాలలో చూస్తూ ఉంటాము కదా . పొడవైన ట్రాక్ లో చివరన బాటిల్స్ ఆకారంలో వరుసగా నిలబెట్టి ఉన్న వాటిని బంతిని విసరి పడగొట్టే బౌలింగ్ ఆట ఇది.
ఒక్కొక్కరికి 300రూపాయిలు తీసుకోని బాల్స్ ఇస్తారు. ట్రాక్ మీద వాళ్ళు ఇచ్చే ప్రత్యేకమైన షూస్ వేసుకొని మాత్రమే బౌలింగ్ చేయాలి. పైన స్కిన్ మిద స్కోర్ కనపడుతుంది.
ఇక్కడ హోరెత్తించే సంగీతం వినిపిస్తూ ఉంటుంది.  తినడానికి, తాగడానికి అన్ని దొరకుతాయి. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం