గుర్తుకొస్తున్నాయి....

గుర్తుకొస్తున్నాయి....
పండగ వస్తే చాలు పిల్లలకు కొత్తబట్టలు, పిండి వంటలు ఇవేకదా ! అమ్మమ్మ ఇంట్లో మనవలము పదిమందిమీ ఉండే వాళ్ళం . అందరికి ఇంటి దగ్గరకు వచ్చే బట్టల మూట వాడి దగ్గరే షాపింగ్ . కూతులళ్ళకి , కోడళ్ళకి చీరలు, మనవలకి లాగు, చొక్కాలు ఒకే రకం గుడ్డలు తీయించి కుట్టిమ్చేవారు . బట్టలు కొనడం ఒక ఎత్తు అయితే అవి కుత్తించుకోడం మరో ఎత్తు అయెది. ఊరందరికి మన వంశీ గారి లేడీస్ టైలర్ లాంటి టైలర్ ఒకడు ఉండేవాడు . వాడికి కొలతలు ఇచ్చిన దగ్గర నుంచి వేరే పనేం ఉండేది కాదు. స్వాతిముత్యం లో కమల్ హాసన్ లాగ పూటకి రెండు సార్లు వాడి దగ్గరకు తిరగటమే పని. ఎంతలా తిరిగినా పండగ రేపు అనగా కానీ ఇచ్చేవాడు కాదు. ఇంక అక్కడి నుంచి కొత్త బట్టలు ఎప్పుడెప్పుడు వేసేసుకుందామా అని అందరు హడావిడి పడే వాళ్ళం .
              భోగికి నాలుగు రోజుల ముందు నుంచి మరో హడావిడి ఉండేది. ఎక్కడెక్కడి నుంచో కర్ర దుంగలు , ఎండిన చెట్ల కొమ్మలు కొట్టుకు రావటం , వీధిలోని వారందరి ఇంట్లోని పనికిరాని కుర్చీలు విరిగిన కర్ర సామగ్రిని సేకరించడం పెద్ద సరదాగా ఉండేది. పెద్ద పిల్లలతో పాటు కూడా తిరగటం , కర్ర సామగ్రి మోసుకు రావటం బాగుండేది. పనిలో పని వాళ్లకి విరాళంగా అడిగినవి ఇవ్వని వారి దగ్గర నుంచి దొంగతనంగా తాటి దూలాలు, వాసాలు , కర్ర సామగ్రి గాని రాత్రి పూట తెచ్చేయడం ,భోగి మంట  లకి సమర్పించడం బాగుండేది .
             మీ కాకినాడ కాజా




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం