అంతర్యామి మూడవ భాగము



మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి వారు ప్రతినిత్యం ఏదో ఒక దానిని అన్వేషిస్తూనే ఉన్నారు. అన్వేషణ ఫలితం గానే ఈనాడు మనం చూసే ప్రతి వస్తువు కనుక్కోబడింది. అది లోక హితమే కాని బ్రహ్మ తమకు ఉద్దేశించిన సుఖ సంతోషాలు, స్వర్గ సౌఖ్యాలు ఎక్కడ ఉన్నాయో అని నిరంతరం వెదుకుతూనే ఉన్నారు. భూమి లోపల, సముద్ర గర్భాన, అంతరిక్షాన , గ్రహాంతరాలలో, అన్ని చోట్ల వెదుకులాట ఆపలేదు. దానికై కుల మతాల వైషమ్యాలు, ధనిక పేద వర్గాలు, అంతర రాష్ట్ర , అంతర దేశ యుద్దాలు, సహజ వనరుల దోపిడీ, ధన , కనక , వస్తు , వాహనాలు పోగేసుకొని అందులో సుఖాలు ఉన్నాయేమో అని చూస్తున్నాడు. అంతులేని సంపద లోను, అధికార మదం లోనూ, మద్యపాన మత్తులోనూ , ఇంకా ఇంకా ఇతరత్రా అనేక వాటిలో సుఖ సంతోషాలను వెదుకుతూ తన జీవితపర్యంతం దేనికో దానికి తపన పడుతూనే ఉన్నాడు. అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నాడు. ఎండమావి లాటి ఆశల వెంట తిరుగుతూనే ఉన్నాడు.
        ఇంతకీ బ్రహ్మ అంతులేని ఆనందాన్ని , అమరలోక సౌఖ్యాలను దాచిన ప్రదేశం ఏమిటో తెలిసిందా? అది మన లోనే దాచాడు బ్రహ్మ ఎందుకంటే ఎవరైనా తనలోన ఉన్న గొప్పతనాన్ని గుర్తించరు. అది ఎక్కడో ఉంది అని వెంపర్లాడుతుంటారు. లోకాలన్నిటినీ గాలించినా దొరకనిది, మనలోనే ఉన్ననూ మనం గుర్తించనిది అదే సంతృప్తి. అది ఉన్న వాడికి కలిగిన తృప్తి వేరు. గంజి అన్నమైనా పంచ భక్ష్య పరమాన్నంగా తోస్తుంది. ఉన్న చోటే స్వర్గ తుల్యమౌతుంది. అది గ్రహించిన వారు భూలోకస్వర్గంలో అంతులేని ఆనందాన్ని పొందుతున్నారు. సంతృప్తి లేని వారు అంతులేని ధనరాశులున్నా ఏమీ లేనట్లు అసంతృప్తితో ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకొంటూ తమ జీవితాలను నరకప్రాయం చేసుకొంటున్నారు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం