కుడి ఎడమైతే పొరపాటు లేదోయి....







కుడి ఎడమైతే పొరపాటు లేదోయి....
అని సినీ కవి రాస్తే ఆ సినిమాలో సన్నివేశాలకు తగినట్లు వ్రాసి ఉండవచ్చును. కాని మనం నిజజీవితంలో అలా అనుకొంటే పొరపాటే అవుతుంది. మనకు చిన్నతనం నుంచి చెప్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎడం వైపున వెళ్ళాలి అని . వాహనాలలో వెళ్ళినా , నడచి వెళ్ళినా కూడా మనం ఎప్పుడైనా ఎడం వైపున ప్రయాణించాలి. అది రోడ్డు భద్రతా నియమం , మన నైతిక బాధ్యత కూడా . సరే చాలా మంది బాగానే  పాటిస్తారు. కాని నేను ఇప్పుడు చెప్పబోయే విషయం అది కాదు. చాలా మంది చిన్న పిల్లలను నడిపించుకొని వెళుతుంటారు. అప్పుడు వాళ్ళు ఏవైపు నడిచినా వాళ్ళ పిల్లలను వాళ్ళ కుడి వైపు నడిపిస్తారు. అది చాలా ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు మనంత కుదురుగా నడవరు కదా! ఒక వేళ ఏ మాత్రం చెయ్య వదిలేసినా , వాళ్ళు అటూ, ఇటూ పరుగుపెట్టినా వాళ్ళకి , మిగిలిన వాహనాల వాళ్ళకి కూడా ప్రమాదంకదా. ఇది నేను చెప్తుంటే సిల్లీ గా ఉండి ఉండవచ్చును. కాని ఆలోచించండి. అది ఎంత ప్రమాదమో ! కాబట్టి వాళ్ళని మనకు ఎడమ వైపు చేతిని పట్టుకుని నడిపిస్తే ఎవరికీ ప్రమాదం ఉండదుకదా!.
అదే విధంగా చాలామంది ఉదయం , సాయంత్రం వేళల్లో తమ పెంపుడు కుక్కలను తీసుకొని వెళుతుంటారు. వాళ్ళు కూడా అంతే . కుక్కలను కూడా ఎటు పడితే అటు నడిపించుకు వెళ్తారు. అంతే కాకుండా గొలుసును చాలా పొడవుగా పట్టుకొంటారు . అది చాలా ప్రమాదం. ఇతరులను చూసి బెదిరినా, అరుస్తూ  మీద పడినా వాళ్ళు కంగారు పడటం ప్రమాదాలు జరగటం చూస్తూ ఉంటాము. అది కూడా వాళ్ళు గమనించుకోవాలి. అందుకే కుడి ఎడమైతే పొరపాటే !
           భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ వ్యాసం వ్రా యడం జరిగింది . .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం