గుర్తుకొస్తున్నాయి... మంగభాను భానుప్రియ అయ్యిందిలా



భానుప్రియ  కు జన్మదిన శుభాకాంక్షలు.
ప్రముఖ సినిమా  దర్శకులు శ్రీ వంశీ గారు మంచి రచయిత కూడా. ఆయన రచించిన "మహల్లో కోకిల" నవలే తరువాత ఆయనే  సితార  సినిమాగా తీసారు. కధలో లాగే అంతవరకూ ఎవరికీ తెలియని మంగభాను  సినిమాతో భానుప్రియగా   మారి "జిలిబిలి  పలుకుల మైనా మైనాపాట లాగే చూస్తుండగానే ప్రముఖ హీరోయిన్ గా ఎదిగింది.   సినిమా  వచ్చిన  రోజుల్లో నేను ఇంటర్ అయి డిగ్రీలో చేరాను. "కిన్నెరసాని  వచ్చిందమ్మా వెన్నెల పైటేసిఅంటూ అభినయంతో  అందరి గుండెల్లో గుబులు రేపింది. సినిమా అప్పట్లో చాలా హిట్ అయింది. భానుప్రియ, సుమన్ లకు మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా అది. అప్పటి నుంచి నేను భానుప్రియ అభిమానిని. తరవాత  రాజేంద్రప్రసాద్ తో వంశీ గారు " ప్రేమించు, పెళ్ళాడు" తీసారు. అందులో " గోపెమ్మ చేతిలో గోరుముద్ద, రాధమ్మ చేతిలో వెన్నముద్ద , ముద్ద కావాలా, ముద్దు కావాలా " అంటూ యువ ప్రేక్షకులను ఉర్రూతలూపింది. సినిమాలో మిగిలిన పాటలు "వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ  కలవరం" అంటూ కలవరం  రేపింది. ఇంకా "నిరంతరము వసంతములే", " చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని" కూడా రోజుల్లో మ్యూజికల్ గా చాలా హిట్. అన్వేషణలో అక్కను చంపిన హంతకులను వెదికేందుకు పక్షులపై పరిశోధన చేస్తున్నట్లు అడవిలో జరిపిన అన్వేషణ సూపర్ హిట్. ఇందులో కార్తీక్ తో "కీరవాణి, కిలకిల ",ఏకాంత వేళ" పాటల తో పులకింతలు కలిగించిందిమోహన్ తో చేసిన ఆలాపనలో " కనులలోమొదలయిన పాటలు, వెంకటేశ్ తో శ్రీనివాసకల్యాణం లో "తుమ్మెదా, తుమ్మెదా", వెంకటేశ్ తో నటించిన  స్వర్ణకమలం లో " కొత్తగా రెక్కలొచ్చెనా", "అందెల రవమిది పదములదా", "ఘల్లు,ఘల్లు", " ఆకాశంలో ఆశల హరివిల్లు", పాటలు ఆమె    ఆమె సినీ జీవితానికి పూల బాటలు పరిచిందని చెప్పటంలొ అతిశయోక్తి కాదు. నేను భానుప్రియకు వీరాభిమాని కావటంతో ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, సచిత్రవారపత్రిక, మొదలయిన వారపత్రికల ముఖచిత్రంగా వస్తే కవర్ పేజీని నోట్స్ లకు అట్టలుగా వేసుకొనేవాడిని. పాపం నా స్నేహితులు కూడా ఎక్కడ దొరికినా అట్టలు వేసుకొనేందుకు ఇచ్చేవారు. ఇక భానుప్రియ సినిమా వచ్చిందంటే కాలేజి మానేసి అయినా చూసేయాల్సిందే.        అలా అలా ఆమె మంచి హీరోయిన్ గా ఎదిగింది. అందరికీ తెలిసిన విషయమే. రోజు భానుప్రియ జన్మదినం.

భానుప్రియకు జన్మదిన శుభాకాంక్షలతో.... మీ కాకినాడ కాజా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం