అమ్మ చేత వంట శాలా, పాఠ శాలే .

అమ్మ చేత వంట శాలా, పాఠ శాలే .


నేను స్కూల్లో చేరిన కొత్తలో నుంచి కూడా అమ్మ పద్యాలు, అంకెలు అన్నీ ఇంటి దగ్గర నేర్పేది. అవే కాకుండా ప్రతి విషయం నుంచీ ఏదో ఒక విషయం నేర్చుకొనేలా చేసేది. ఖాళీ సమయాల్లో తినడానికి పాలకాయలు, జంతికలు వంటివి చేసేటప్పుడు వాటి నుంచి అనేక అక్షరాలు, అంకెలు, ఆకారాలు గుర్తించమనేది. పాలకాయలంటే వరిపిండితో చిన్న చిన్న ఉండలు చేసి నూనెలో వేయించేది. అవి చేసేటప్పుడు పిండిని పొడవుగా తల, తోక వచ్చేలా చేసి బల్లి ఆకారంలో చేసేది. కళ్ళు స్థానంలో పెసర బద్దలు పెట్టి నూనెలో వేయిస్తే అచ్చం బల్లిలా ఉండేది. అలా చిన్న చిన్న తేలిక పాటి ఆకారాలు చేసి చూపేది.
       అలాగే జంతికలు చేసాక  తినేటపుడు  విరిచినపుడు అవి అంకెలో, అక్షరాలో ఏదో ఒక ఆకారాన్ని పోల్చిచెప్పేది. అలా అలవాటయింది. కనిపించే ప్రతిదాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడం
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం