ఎందుకో ... ఏమిటో ....



సాధారణంగా ఒకే పనిని పదే పదే చేస్తున్నపుడు పని త్వరగా, చక్కగా నిర్వర్తిస్తాము. తినగ తినగ వేము తియ్యనుండు అన్నారు కదా శతక కారుడు. అదే పని ఇతరుల కన్నా బాగా చేస్తే అదే నైపుణ్యం అవుతుంది నైపుణ్యం కొందరిలో ఎక్కువ ఉంటుంది కూడా . వాళ్ళనే నిపుణులు అంటాము. అదే మనం చేసే పనిలో యంత్ర పరికరాలు సాయపడుతుంటే మన పని మరింత చురుగ్గా అవాలి. అది రివాజు.
        కాని బ్యాంకుల్లో చూడండి ఇది వరకు డబ్బులు వేయడానికో , తీయడానికో వెళ్ళాం అనుకోండి మన ఓచర్ తీసుకొని లెడ్జర్ లో నోట్ చేసుకొని , అది మెసెంజర్ కిస్తే సీనియర్ ఆఫీసర్ చేత సంతకం చేయించి ఇచ్చేవాడు. క్లర్క్ మనపని చూసి పంపేవాడు. అదే ఇపుడు బ్యాంక్ కి వెళ్ళి చూడండి. కంప్యూటర్స్, ఆన్ లైన్ వ్యవహారాలు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వచ్చినా పని కష్టాం అయిపోతోంది. పుస్తకాలు , వ్రాయడాలు ఏమీ లేవు. సీట్ కదలక్కరలేదు. మునివేళ్ళతో మీటలను సరిగమ పలికించడమే , పని అయిపోవాలి. కౌంటర్ లో క్లర్క్ ఎంటర్ చేయాలి. ఆఫీసర్ ఆధరైజ్ చేయాలి. ఇంతలో సర్వర్ డౌన్ కావడమో, సిస్టం ఆగిపోవడమో , ప్రింటర్ పని చేయక పోవడమో జరుగుతుంది. లైన్ అలాగే ఉంటుంది. అందరూ అంటున్న మాటలే ఇవి " ఇది వరకే నయం , కంప్యూటర్స్ వచ్చాకే లేట్ అవుతోంది " అని మరి ఎందుకో ....  ఏమిటో ...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం