మన దేశం లోని ప్రముఖ సూర్య దేవాలయాలు.



మన భారత దేశంలో సూర్యునికి గల దేవాలయాలలో ప్రముఖమయినది ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం. దేవాలయాన్ని చూడండి.

 శిల్పకళ ఎలా ఉట్టి పడుతోందో. ఇది దేశం లోనే అతి పురాతన సూర్య దేవాలయం.
గుజరాత్ నందున్న మోదెరాలో కూడా ఒక సూర్య దేవాలయం ఉంది. చూడండి.

మన రాష్ట్రంలో శ్రీకాకుళం లోని అరసవిల్లి సూర్యదేవాలయం కూడా ప్రసిద్ధి పొందినదే.

 ఇది మనకు దగ్గరలోని పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం.
మనకు పక్కనే ఉన్న పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ లో కూడా సూర్యదేవాలయం ఉంది. చూడండి.

 మన నగరంలో ప్రముఖ సెంటర్ ఏది అని అడిగితే అందరూ చెప్పేది భాను గుడి సెంటర్ అంటారు. మరి పేరు అక్కడ ఉన్న భానులింగేశ్వరస్వామి దేవాలయం వలనే అది కూడా సూర్యదేవాలయమే.

 ( ఫోటోలు గూగులమ్మ సౌజన్యంతో)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం