నక్క- మోడ్రన్ కాకి

       

అడవిలో ఒక కాకి ఉంది. ఒకరోజు దానికొక మాంసం ముక్క దొరికింది. నోటితో కరచి తెచ్చి చెట్టుపై కూచుని తిందా మనుకొందామనుకొంటోంది. ఇంతలో అటుగా వెళ్తున్న నక్క ఒకటి కాకి నోటిలో మాంసం ముక్కను చూసింది. ఎలాగైనా కాజేయాలనుకుంది.

         కాకి బావా! కాకి బావా! అడవిలో జంతువులన్నీ నీ గానం గురించే చెప్పుకుంటున్నాయి తెలుసా ఒకసారి ఒక పాట పాడవా? అంది జిత్తుల మారి నక్క.
( ఓస్ ఇంతేనా ! నా చిన్నపుడు మా అమ్మమ్మ కధ చెప్పిందిలే. కాకి పొంగిపోయి పాట పాడుతుంది. మాంసం ముక్క జారిపోతుంది. నక్క మాంసం ముక్క పట్టుకొని పారిపోతుంది. దీనికోసం అంత బిల్డప్ అవసరమా? అనుకొంటున్నారు కదూ ! సరే కధలోకి రండి.)
       సరే నక్కబావా! నువ్వు అంతలా అడుగుతుంటే పాడకపోతే బాగుంటుందా చెప్పు, అని పాట పాడింది కాకి. మాంసం ముక్కని కాళ్ళ కింద పెట్టుకొని.
       నక్క వెర్రి ముఖం పెట్టుకొని చూస్తుంటే కాకి ఇలా అంది. నిన్ననే నెట్ లో కాకి - నక్క కధ చదివానులే. కధలో కాకిలా నేనేం వెర్రిదానిని కాదు. అంటూ మాంసం ముక్కని తినేసింది నక్కని ఊరిస్తూ .

       ఇంక లాభం లేదనుకొని నక్క వెళిపోతూ ఇలా అనుకొంటోంది. అమ్మో ఇవాల్టి నుంచి" కాకినాడ కాజా" బ్లాగ్ చదవాలి రెగ్యులర్ గా అని

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం