టాన్ గ్రామ్స్ చెయ్యడం ఇలా


టాన్ గ్రామ్స్ చెయ్యడం ఇలా



మీరు  క్రితం పోస్ట్ లో కొన్ని  టాన్ గ్రామ్స్ తో చేసిన బొమ్మలు చూసారు కదా. అవన్నీ కేవలం ఈ క్రింద చూపిన ఆరు ముక్కల  ఆకారాలలో  నుంచి తయారయినవే. ఇవన్నీ ఆరు ముక్కల  టాన్ గ్రామ్స్.



టాన్ గ్రామ్స్ అనేవి  ప్రాచీన కాలం నుంచీ చైనా దేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో అనేక రకాల పజిల్స్ చేసి ఆడేవారుఅసలు టాన్ గ్రామ్స్ అనేవి ఏడు ముక్కలతోనే ఎక్కువగా తయారు చేస్తారు.వాటిని తయారుచేయడం ఇలా. 


 నలుచదరంగా ఉన్న దళసరి కాగితం గాని చెక్క ముక్కలను గాని తీసుకొని  బొమ్మలో చూపించినట్లుగా పెన్సిల్ తో గీతలు గీసుకొని వాటిని ఆకారాలలో కట్ చేసుకోవాలి. ముక్కలను  వివిధ ఆకారాలు వచ్చేటట్లు అమర్చడమే. అది మన ఊహలకు పదును పెట్టే మంచి పజిల్ అని చెప్పవచ్చునుఅలా చేసిన కొన్ని బొమ్మలు చూడండి వాటితో మీ ఊహలకు తట్టిన మరిన్ని బొమ్మలు అమర్చు కోండి.




మరింకెందుకు ఆలస్యం ప్రయతించండి.  టాన్ గ్రామ్స్ లో మరిన్ని రకాల  గురించి మళ్ళీ పోస్ట్ లో చెప్పుకుందాం. 
మీ కాకినాడ కాజా 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం