ముళ్ళు లేని గులాబీలు


" గులాబీలకు ముళ్ళుంటాయి అని గొణుగుతుంటారు అందరూ "
ముళ్ళకే గులాబీలు పూసాయని సంతోషిస్తారు కొందరు "
పైన్ ఉన్న కొటేషన్ చదివారు కదా లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. మొదటి వాక్యం నిరాశావాదులను, రెండవ వాక్యం ఆశావాదులను సూచిస్తుంది. ఎంత ఉన్నా, ఏమి చూసినా ఇంకా లోటుందని , ఏదో కావాలనే తపనే తప్ప ఉన్న దానితో తృప్తి చెందాలనే ఊహ లేకనే అసంతృప్తితో రగిలి పోతూ , ఎండ మావుల వెంట పరిగెడుతున్నాడు మనిషి.
        ఆశా వాదులకు , నిరాశా వాదులకు మరొక చక్కని ఉదాహరణ చూడవచ్చును. ఒక గ్లాసు లో సగం వరకూ నీళ్ళు పోసి ఇద్దరినీ అడిగితే ఆశావాది గ్లాసులో సగం నీరు ఉందని చెపితే , నిరాశావాది సగం ఖాళీగా ఉందని అంటాడు.
        అయితే నిరాశావాదుల వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి . నిత్య భయం వల్ల కూడా కొన్ని జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారుఅందుకే ఆశావాది విమానాన్ని కనిపెడితే , నిరాశా వాది పారాచూట్ కనిపెట్టాడంటారు.  ( నిజానికి విమానాలు కనిపెట్టక ముందే పారాచూట్ కనిపెట్టారు ).
      ఇంతకీ అసలు ముళ్ళు లేని గులాబీలు ఉన్నాయా? ఉన్నాయి. వాటిని చూడాలంటే నా తరువాత పోస్ట్ లో చూడండి.
                                                                                                                                                                              మీ కాకినాడ కాజా 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం