అన్నీ శుభ శకునములే


మనలో చాలామంది తిధులు, నక్షత్రాలు, వారాలు, వర్ఝ్యాలు, మొదలయినవి చూసుకొని గాని పని చేయరు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి . అందులో తప్పేం లేదు. కాని మన పెద్దలు మాత్రం రోజు మంచిది. రోజు మంచిది కాదు. అని ఆయా రోజులకు, తిధులకు ఆపాదించకుండా ఉండేందుకే కాబోలు కొన్ని ప్రత్యేకతలు, పర్వదినాలు , ప్రీతికరాలు అంటూ అన్ని రోజులకూ ఏదో ఒకటి ఏర్పరిచారు.
      
       అలాగే మరి మనకు ఉన్న తిధులు పదిహేను వాటికి కూడా అలానే ఏదో ఒక ప్రత్యేకత ఉంది. అవన్నీ క్రింద చూడండి.
తిధులు             ప్రత్యేకత
. పాడ్యమి      చైత్రశుద్దపాడ్యమి ( తెలుగు సంవత్సరాది, యుగాది)
. విదియ        భానువారం (ఆదివారం) తో కూడినది (భాను విదియ)
. తదియ        వైశాఖశుద్దతదియ(అక్ష తదియ లేదా అక్షయ తృతీయ)
. చవితి         భాద్రపద శుద్ద చవితి (వినాయక చవితి)
. పంచమి      శ్రావణ శుద్ద పంచమి ( గరుడ పంచమి)
. షష్ఠి            మార్గశిర శుద్ద షష్ఠి ( సుబ్రహ్మణ్య షష్ఠి )
. సప్తమి        మాఘ శుద్ద సప్తమి ( రధ సప్తమి )
. అష్టమి        శ్రావణ బహుళ అష్టమి ( గోకులాష్టమి)
  నవమి        చైత్ర శుద్ద నవమి ( శ్రీరామ నవమి)
౧౦. దశమి              ఆశ్వీయుజ శుద్ద దశమి ( విజయ దశమి)
౧౧. ఏకాదశి     ఆషాఢ శుద్ద ఏకాదశి ( తొలి ఏకాదశి)
౧౨. ద్వాదశి     కార్తీక శుద్ద ద్వాదశి (చిలుక ద్వాదశి )
౧౩. త్రయోదశి   శనివారం తో కూడినది ( శని త్రయోదశి)
౧౪. చతుర్దశి    భాద్రపద శుద్ద చతుర్దశి ( అనంత పద్మనాభ  చతుర్దశి)
                     ఆశ్వీయుజ బహుళ చతుర్దశి ( నరక చతుర్దశి)
౧౫. పౌర్ణమి      ఆషాడ శుద్ద పౌర్ణమి ( వ్యాస పౌర్ణమి )
   అమావాశ్య    ఆశ్వీయుజ బహుళ అమావాశ్య ( దీపావళి అమావాశ్య
       ఇవి మాత్రమే  కాదు ఇంకా అవే తిధులకు వేరే పేర్లతొ గాని వేరే రొజుల్లో గాని ప్రత్యేకతలు ఉండవచ్చు . అవి ప్రాంతాలు, ఆచారాలను బట్టి మారవచ్చును. ఏమైనా అన్ని రోజులూ మంచివే . అన్నియునూ  శుభ శకునములే అని భావించవచ్చును.
       సర్వే జనః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు
       అందరికీ  అన్ని వేళలా శుభం కలగాలని కోరుతూ       ...
                                                              మీ కాకినాడ కాజా


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం