మయూరము


మన దేశ జాతీయ పక్షి నెమలి అని అందరికీ తెలుసు కదా! మరి నెమలిని జాతీయ పక్షి గా ఎప్పుడు ప్రకటించారో తెలుసా? నెమలిని మన దేశ జాతీయ పక్షిగా   1963 జనవరి 31 తేదీన మన దేశ ప్రభుత్వం ప్రకటించింది. పక్షులలో నెమలి అందమే వేరు కదా!   
        మగనెమలిని మయూరం అంటారు. ఆడ నెమలిని మయూరి అంటారు. నెమలికి పొడవైన మెడ, తల పైన కిరీటం వలే ఉన్న నిర్మాణం, నీలపు రంగు ఛాతీ, పెద్ద పెద్ద కన్నులు కలిగి వెనుక భాగంలో పొడవైన తోక కలిగి ఉంటుంది. నెమలి రాజసానికి, దర్పానికి గుర్తుగా ఉంటుంది. దీని తోకలో పొడవైన ఈకలుంటాయి వాటికి చివర కన్నులుంటాయి. ఇవే మన చిన్నపుడు పుస్తకాలలో దాచుకున్న నెమలి కన్నులు. ఆకాశం మేఘాలు పట్టి వర్షం కురవటానికి సిధ్ధంగా ఉన్నపుడు నెమలి పులకించి నాట్యం చేస్తుంది.అది చూడటానికి రెండు కళ్ళు చాలవు.
        బాగా నాట్యం చేసేవారిని "నాట్యమయూరి " అంటారు కదా! ఇంతకీ నాట్యం చేసేది ఆడ నెమలి  కాదు. మగ నెమలి ఆడనెమలిని ఆకర్షించేప్రయత్నము అది. అందుకే పురి విప్పి నాట్యం చేస్తుంది.
మగ నెమలి 

ఆడ నెమలి  


తెలుపు రంగు నెమలి.


        నెమలికి  1972   లొ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం రక్షణ కలిపించారు తెలుసా

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం