ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది.



గత సెప్టెంబర్ నెలలో మన సీమాంధ్రలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం జరిగింది. అందులో కార్మికులు, కర్షకులు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, లాయర్లు , డాక్టర్ల్, ఒకరేమిటి అందరూ పాల్గొన్నారు. చాలా బాగుంది ఆ ఉద్యమ స్ఫూర్తి. పాఠశాలలకు పని దినాలు పోయినందున వాటిని సెలవు దినాలలో కూడా పని చేసి పాఠాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఉపాధ్యాయులు పూర్తి జీతం తీసుకోవడం జరిగింది. అయితే తుఫాను కారణంగా రెండు రోజులు, సంక్రాంతి కి మూడు రోజులు తప్ప ఆదివారాలు కూడా సెలవు లేకుండా పాఠశాలలు నడుస్తున్నాయి. జరిగిన నష్టాన్ని పూడ్చడం కోసం ఆలోచిస్తున్నారు కాని పిల్లల గురించి ఎవరూ పట్టించు కోవడం లేదు. వారికి వరుసగా నెలంతా ఒక్కరోజూ సెలవు లేదు. ఉపాధ్యాయులకు వారికి గల సెలవుల నుండి వినియోగించుకొనే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి అవసరం అయితే వారు సెలవు పెట్టుకొని పని చూసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం చేస్తున్నారు. మరి పిల్లలకు విశ్రాంతి అక్కర లేదా. అసలు పగలు, రాత్రి అని ప్రకృతిలో ఏర్పాటు చేయబడినదే పగలు పని చేస్తే రాత్రి విశ్రాంతి తీసుకొంటారు అని. అలా మళ్ళీ మర్నాడు పని చేయడానికి శరీరానికి రీచార్జ్ అవసరం. అలాగే వారానికి ఒకరోజు ఆదివారం కూడా అవసరమే. నష్టపోయిన పని దినాలు భర్తీ చేయడం ఎంత ముఖ్యమో, పిల్లలకు తగిన విశ్రాంతి నివ్వడం కూడా అంత అవసరమే. నిరంతర శ్రమ వల్ల వారు మానసిక గ్లానికి గురి అవుతారు. కనీసం వారం విడిచి వారం ఆదివారం సెలవు ఇవ్వాలి. పాఠశాలలు సంవత్సరానికి రెండు వందల ఇరవై రోజులు కనీసం పని చేయాలనే నిబంధన ఉంది. ఆ పని దినాలు సరిపోతాయి ఇప్పటి వరకూ చేసిన ఆదివారాలు, సెలవు దినాలు. కాబట్టి విద్యావేత్తలు, మానసిక వేత్తలు ,విద్యాధికారులు ఈ విషయంలో ఆలోచించాలి. లేక పోతే ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చినట్లే ఉంటుంది. మీ కాకినాడ కాజా.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం