రధసప్తమి వెనుక శాస్త్రీయ కోణం


        రధసప్తమి అనేది సూర్యుని ఆరాధించే పండుగ. అనాదిగా మానవునికి ప్రకృతిశక్తులను ఆరాధించే ఆచారం ఉంది. అగ్ని, వాయువు, జలము, భూమి, చెట్లు, ఆకాశం మొదలైన వాటితో పాటు సూర్యున్ని కొలిచేవాడు. కారణం ప్రకృతిలో నిత్యం తాను చేసే పనులన్నింటికీ వీటితో సంబంధం ఉండటమే. పంటలు పండించడానికి, ఆహార సంపాదనకు, క్రూరమృగాల బారి నుండి రక్షించుకోడానికి ఇలా ప్రతీదానికి అగ్ని దేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు అందరి సహకారం కావాలని కోరుతూ వారికి పూజలు చేసేవారు. తమ నిత్య జీవన గమనాన్ని ఇవన్నీ నిర్దేశిస్తాయని భావించారు. వారికి ఆగ్రహం కలగటం వల్ల అకాల వర్షాలు, వరదలు , భూకంపాలు, మొదలైన ప్రకృతి భీభత్సాలు కలుగుతాయని భయపడేవారు.
        ఖగోళశాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుని సంచారానికి కూడా సంబంధం ఉందని చెప్పవచ్చును. సూర్యుని రధానికి గుర్రాలు ఏడు. ఇవి ఇంద్రధనుస్సు లోని రంగులుగా, లేదా వారం లోని ఏడు రోజులుగా భావించవచ్చును. సూర్యుని రధచక్రాలకు గల ఆకులు పన్నెండు. వీటిని ఒక సంవత్సరం లోని పన్నెండు నెలలుగా లేదా పన్నెండు రాశులుగా భావించవచ్చును. సూర్యోదయానికి ముందు కన్పించే అరుణ వర్ణాన్నే సూర్యుని రధసారధి అరుణుడు అంటారు. ఇతనికే అనూరుడు అనే పేరు ఉంది (అనూరుడు అంటే ఊరువులు లేనివాడు).
( మరిన్ని విశేషాలకు తరువాతి పోస్ట్ ను చదవండి )

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం