గుర్తుకొస్తున్నాయి ...........

గుర్తుకొస్తున్నాయి ........... 

 సంక్రాంతి సంబరాలు

                    సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి రంగురంగుల హరివిల్లులు ,హరిదాసు కీర్తనలు, భోగిమంటలు,కోడిపందాలు,తీర్థాలు, పడుచుపిల్లలకు పేరంటాలు కదా!. ఈ జెట్ స్పీడ్ యుగంలో వీటికి దూరమయిపోతున్నాము కదా . సంక్రాంతి కూడా మిగిలిన పండగల్లా మామూలుగా జరిగిపొతోంది. కాని ఈ పండగకున్న ప్రత్యేకతే వేరు. ప్రతీ పండుగకు ఒక అర్థం పరమార్థం కల్పించారు మన పూర్వీకులు. వ్యవసాయక దేశమయిన భారతదేశంలో రైతన్నలకు పంట చేతికి వచ్చిన రోజే కదా పండగ .
                   ఆ రోజుల్లో సంక్రాంతి అనగానే ఇరవై రోజులకు పైగా సెలవులు ఇచ్చే వారు. ఇచ్చిన వెంటనే చలో అమ్మమ్మ ఇంటికి అని బయలుదేరేవాళ్ళము. మామయ్యతో పొలాలకు వెళ్ళేవాళ్ళము. కుప్పలు నూరుస్తూ ఉంటే పూజ చేసి ప్రసాదాలు పంచేవారు . నూర్చటం అంటే ట్రాక్టర్ లతో కాదు బల్ల కొట్టడం ,ఎద్దులతో తొక్కించడం ,చేసేవారు. గడ్డిలో దొల్లుతూ ఆడేవాళ్ళం. ఇంటికి వచ్చాక దురదలతొ ఏడ్చే వాళ్ళం అనుకోండి . 
                   రోజువారి పనులుచేసే పనివారు అందరు కళ్ళం దగ్గరకు వచ్చేవారు . ఇప్పటిలా నెల జీతాలు కాదు కదా ఏడాదికోసారి పంట చేతికి వచ్చినపుడే జీతాలు కొలవటం . అందుకే అది పండుగ అయ్యేది . కళ్ళంలోనే పాలేర్లకు,మంగలి,కుమ్మరి,కమ్మరి,చాకలి ఇతర పని వాళ్ళందరికీ అక్కడే ధాన్యం కొలిచేవారు ఏడాది కష్టానికి ప్రతిఫలం దక్కేది అప్పుడే అందుకే అది పండగ అయ్యేది.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం