గణేష్ పెళ్ళికి అన్నీ గండాలే.

గణేష్ పెళ్ళికి అన్నీ గండాలే.


రోజు చాలా ముఖ్యమైన రోజు. మా నాయక్ ని స్కూల్లో జాయిన్ చెయ్యాలి. అదేంటి చిరంజీవి గారి అబ్బాయి రాంచరణ్ మీ నాయక్ ఏమిటి అనుకోకండి. అతనికేంటి మూడు ఫైట్స్, ఆరు డ్యూయెట్స్ గా సినిమాలు చేసుకొంటూ, నాకుఎవడు” పోటీ అంటున్నాడు. నేను చెప్పేది నాయక్ కాదు మా వినాయకరావు మామయ్య మనవడు, మా బావ గణేష్ కొడుకూ వి"నాయక్" గురించి. దానిగురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి చక్రాలు వెనక్కి తిప్పాలి. గణేష్ కి వాళ్ళ తాత పేరు గణేశ్వరుడు అని పెడితే వాడు గణేష్ గా మార్చుకొన్నాడు. ( మీకో డౌట్ వచ్చేసిందా తాత ముత్తాతలు అందరి పేర్లు వినాయకుడి పేర్లేనా అని. కరక్టే ఆయన వీళ్ళ వంశానికి ఇలవేలుపు లెండి ). వాడు, నేను ఒకే వయసు వాళ్ళం. ఇద్దరం ఇంటర్ వరకూ కలిసి చదివాం. నేను డిగ్రీ చేసి టీచర్ నయ్యా. నాకు గంతకు తగ్గ బొంతలా మరో టీచరమ్మ నిచ్చి పెళ్ళి చేసారు. మేమిద్దరం మాకు ఇద్దరువాడు ఇంజనీరింగ్ చేసాడు. అక్కడే కధ మొదలయింది.
       మా గణేష్ ఇంజనీరింగ్ చేసాక ఉద్యోగంలో చేరక, ఇంకా ఏవో కంప్యూటర్ కోర్స్ లు చేయాలని, అప్పుడు కాని పెళ్ళి చేసుకోనని కూర్చున్నాడు. హైదరాబాదు  అమీర్ పేట్ లో మకాం పెట్టాడు. ఏవేవో కోర్సులు చేసాడు. అమెరికా వెళ్ళాడు. అప్పటికి మన వాడికి ముప్పై వచ్చాయి. మా మామయ్య అదో రకం మనిషి. వీడు ఇదో రకం మనిషి. వచ్చిన సంబంధాలన్నిటినీ ఏదో వంక పెట్టేవారు. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు తరచి తరచి చూసేవాడు. ఒక సంబంధం వాళ్ళ అమ్మమ్మ తమ్ముడి కొడుక్కి బొల్లి అనీ, మరో సంబంధం వాళ్ళ మేనత్త కొడుకు వేరే శాఖ అమ్మాయిని చేసుకొన్నాడని, ఇలా వచ్చిన వన్ని తిప్పేసారు. నాన్నకి నచ్చితే కుర్రాడికి నచ్చేవి కాదు. అసలే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలేమో కూచుని, కూచుని బొజ్జ ముందుకు, నెత్తిమీద జుట్టు వెనక్కి అయింది.

       పెళ్ళికి తరలి వెళ్ళాం. ఉదయం స్నాతకం అయింది. ఆడపెళ్ళివారు మర్యాదలు బాగానే చేసారు. రాత్రి ముహూర్తం దగ్గరయింది. మా గణేష్ కీ , మామయ్యకీ చాలా ఆనందంగా ఉంది. మరి ఎన్నాళ్ళో వేచిన ఉదయం లాగా కుదరక కుదరక అవుతున్న పెళ్ళి కదా. కరెక్టగా తాళి కట్టే సమయం వచ్చింది. ఇంతలో సినిమాల్లో చూపించినట్లు ఆగండి, పెళ్ళి జరగడానికి వీల్లేదు అంటూ కేక వినపడింది. గణేష్ బిక్కచచ్చి పోయాడు. ఇదేం తద్దినంరా అని. ఒకతను పోలీస్ ను తీసుకు మరీ వచ్చాడు. ఇంతకీ సంగతి ఏమిటంటే అమ్మాయికీ, అతనికీ ముందే పెళ్ళి అయిపోయిందట. ఇంట్లో చెప్పడానికి భయమేసి అమ్మాయి ఇలా ప్లాను చేసిందట. మా గణేష్ గాడ్ని చూసి మేమందరూ అనుకొన్నాం. గణేష్ గాడి పెళ్ళికి అన్నీ గండాలే అని.
       కొసమెరుపు ఏమిటంటే చివరికి వేరే సంబంధం కుదిరింది. వాళ్ళ కొడుకే వినాయక్’ . వాడిని స్కూల్లోనూ , మా అబ్బాయిని కాలేజీ లోనూ చేర్పించాలి రోజు అందుకే హడావిడి. ఉంటాను మరి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం