రధ సప్తమి విశేషాలు


        మాఘ శుద్ధ పంచమిని మనం రధ సప్తమిగా జరుపుకుంటాము. రధసప్తమికే సూర్య జయంతి, సౌర సప్తమి, భాస్కర సప్తమి, మాఘ సప్తమి, మన్వాది అనే పేర్లున్నాయి. కర్మసాక్షి , ప్రత్యక్ష భగవానుడు అయిన శ్రీ సూర్యనారాయణుని పుట్టిన రోజుగా దీనిని జరుపుకుంటాము. కశ్యపునికి, అదితికి జన్మించిన వాడు సూర్యుడు. ఈయనకు వివస్వంతుడు అనే నామాంతరము ఉంది. సూర్యుని కుమారుడు ఏడవ మనువు అయిన వైవస్వంతుడు. ఇతని పేరు మీదనే ప్రస్తుతం జరుగుతున్న  వైవస్వతమన్వంతరము మనం ప్రతి రోజూ సంకల్పములో చెప్పుకునేది. రోజును మన్వంతరము ప్రారంభం అయిన రోజని "మన్వాది" ( యుగాది లేక ఉగాది వలె) అని కూడా పిలుస్తారు.
        రోజు నుంచి వరుస అయిదు రోజులు సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి లను  భీష్మ పంచకం అంటారు. భారత యుద్ధంలో అర్జునుని శరాఘాతానికి కుప్పకూలిన భీష్మ పితామహుడు అప్పటికి ఇంకా దక్షిణాయనం అవటం వలన ఉత్తరాయణ పుణ్యకాలం రావటం కోసం అంపశయ్య మీద ఎదురుచూసి అయిదు రోజులలో రోజుకొక్కటి చొప్పున పంచ ప్రాణాలు వదిలేసాడని పురాణ గాధ. అందుకే రోజున పితృదేవతలకు తర్పణాలు వదిలే ఆచారం కూడా ఉంది.
( సూర్య భగవానుని గురించి మరిన్ని విశేషాలు, సూర్య దేవాలయాల గురించి తెలుసుకోవటానికి తరువాతి పోస్ట్ లో చదవండి)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం