అంతర్యామి




అది సకల చరాచర జీవరాసులసు సృజించే సమయం. అదే సృష్టికర్త ప్రపంచంలోని అన్ని జీవాలను సృష్టించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. విధాత కంటికి కంటికి కనిపించని సూక్ష్మాతిసూక్ష్మమైన జీవుల నుంచి అతి పెద్ద జీవుల వరకు అన్నింటినీ సృష్టించాడు. చిన్న చీమ నుంచీ అతి పెద్ద ఏనుగు వరకూ అన్నీ సృష్టించడం అయింది. కీటకాలు, సరీసృపాలు, పక్షులు, జంతువులు అన్నీ వచ్చాయి. పరిణామక్రమంలో అన్ని జీవులూ ఒక దానిని మించి మరొక జీవి అభివృద్ది చెంది కనిపిస్తోంది. అయినా కమలసంభవునికి తృప్తి కలుగలేదు. ఇంకా తన సృజనకు పదును తేవాలనుకొన్నాడు. ఎన్నో లక్షల జీవజాతులను సృష్టించినా వాటన్నిటినీ మించిన జీవిని సృష్టించాలని జీవి మిగిలిన జంతువుల కన్నా  బుద్దిలోను ,రూపంలోను అన్నివిధాలా భిన్నంగా వుండాలని కోరుకున్నాడు. కొత్త జంతువు మిగిలిన జంతువుల వలె నాలుగు కాళ్ళతో కాకుండా రెండు కాళ్ళపై నడవాలని , బుద్దిజీవి అయి ఉండాలని, ఆలోచన కలిగి , నోటితో మాట్లాడాలని , రెండు చేతులతో అన్ని పనులు చేయగలగాలని , తన సృష్టిలోనే అతి విశిష్ఠమైనదిగా ఉండాలని తలచాడు. తన ఆలోచనకు మురిసాడు బ్రహ్మ .

( మిగిలిన కధ తరువాతి పోస్ట్ లో .... )

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం