రధ సప్తమి గురించి మరికొన్ని విశేషాలు...





రధ సప్తమి నాడు సూర్యోదయాన్నే ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నుంచుని తలపై ఏడు జిల్లేడు ఆకులు ( అర్క పత్రం) , ఏడు రేగు ఆకులు లేదా రేగి పళ్ళు ఉంచుకొని స్నానము చేస్తారు. ( సూర్యునికి అర్కః అన్న పేరు ఉన్నది. అందుకే అర్క పత్రము ప్రీతి అంటారు ) . స్నానము చేస్తూ క్రింది శ్లోకం పఠిస్తారు.
" యత్యత్ జన్మ కురుమే పాపం మయా సప్తమ జన్మాసు, తన్మే రోగంచ, శోకంచ, మా కరేహంచు సప్తమీ..... " అని పఠిస్తారు. విధంగా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలను ( జన్మలో చేసినవి, జన్మాంతరంలోనివి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, మానసికంగా చేసినవి, వాచికంగా చేసినవి, శారీరకంగా చేసినవి. ) , ఏడు రకాల రోగాలను తొలగిస్తాడని భావిస్తారు.
        రధసప్తమి నాడు సూర్యుడు సప్తాశ్వములను పూన్చిన బంగారు రధం మీద రధసారధి అరుణుడు (ఇతనికే అనూరుడు అనగా ఊరువులు లేనివాడు అని కూడా పేరు ఉన్నది ) తోలుతుండగా దక్షినాయనం నుంచి ఉత్తారాయనానికి మరలి వెల్తాడని భావిస్తారు. చిక్కుడు కాయలతోచేసిన రధం పూజలో వాడతారు. సూర్యునికి ఎదురుగా ఆవు పేడ పిడకలతో దాలిలో ఇత్తడి గిన్నెలో ఆవు పాలను పొంగిస్తారు. ఆవు పాలను పొంగించుతారు. పొంగిన తరువాత బియ్యం, బెల్లం కలిపి పరమాన్నంగా చేస్తారు. చిక్కుడు ఆకులలో ప్రసాదంగా తీసుకొంటారు.


( మరిన్ని విశేషాలకు తరువాతి పోస్ట్ ను చదవండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం