రాజాస్ సీట్ -- ఎ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్

మడికేరి లో అందాలెన్నో ఉన్నా సాయంకాలం సమయం లో తప్పక చూడవలసిన ప్రదేశం మాత్రం రాజాస్ సీట్ అని పిలువబడే ఈ వ్యూ పాయింట్ . ఇది చాలా చక్కని చోటు కావడం వలెనే రాజు గారు రోజు ఇక్కడ కుర్చుని సాయం సంధ్య అందాలు చూస్తూ ఉండే వారట అందుకే రాజాస్ సీట్ అని పేరు వచ్చింది . ఇది నిజంగా ఎంతో అందమైన దృశ్యాలకు నెలవైన చోటు . 

ఇక్కడ రాజు గారి స్మారక చిహ్నం కూడా నిర్మించారు . ఈ ప్రదేశాన్ని మంచి హాయి గొలిపే చక్కని ఉద్యానవనంగా రూపు దిద్దారు . 



ఈ ప్రదేశం గురించి వివరిస్తూ శిలా ఫలకం కూడా ఉంది .




ఇక్కడ మంచి సుందర వీక్షణ ప్రదేశంగా మార్చారు .

పచ్చని పచ్చిక బయళ్ళు , మంచి మంచి మొక్కలతో సుందర ఉద్యానవనం ఇది














పిల్లలు , పెద్దలు సరదాగా ఎక్కి తిరగడానికి టాయ్ ట్రైన్ కూడా ఏర్పాటు చేసారు .




ఇక్కడ నుంచి చూస్తుంటే మనసు గాలిలో తేలిపోతుంది . రెక్కలు కట్టుకుని ఎగరాలని పిస్తుంది . మబ్బులలో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలనిపిస్తుంది .



 ఎటు చూసినా చక్కని పచ్చని పొలాలు కనులకు విందులు చేస్తూ ఉంటాయి .



దూరంగా లక్క పిడతల లాగ కనిపించే బొమ్మరిళ్ళు లాటి ఇళ్ళు . చిన్న పిల్లలు ఆడుకొంటూ వదిలి వేసి వెళ్ళిన బొమ్మల లాగా చెల్లా చెదురుగా ఉన్నాయి.
 బోర్లించిన గిన్నెల లాగా దూరంగా కొండలు , మెలికలు తిరుగుతూ వెళ్తున్న పాములాటి రోడ్డు మనకు కనిపిస్తున్నాయి చూడండి .



 






కర్ణాటక లో ఎక్కడ చూసినా కనిపించేవి ముఖ్యంగా సోలారు దీపాలు . ప్రతి చిన్న గ్రామం లోను కూడా సోలారు విద్యుత్ దీపాలు , సోలార్ వాటర్ హిటర్లు , అవి అమ్మే షాప్స్ కనిపిస్తాయి . ఇక్కడ కూడా సాయంత్రం చీకటి పడ్డాక వెలిగే తట్లుగా వాటిని అమర్చారు .

ఇక్కడ సాయంత్రం అయేసరికి అందరు చేరతారు . చీకటి పడే సమయంలో సాయం సంధ్యా అందాలు చూపులకు కనువిందు లు చేస్తాయి . ఇక్కడ చుట్టూ దీపాలు , మ్యూజికల్ ఫౌంటెన్ అమర్చారు . అవి కూడా చూడటానికి చాలా బాగుంటుంది .





సాయం సంధ్య అందాలు చూడండి . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం