సర్వం ప్రకృతి సిద్ధమే
కావేరినిసర్గ్ ధామ్ లో ఒక చిన్న కుటీరంలో ఒక షాప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ అన్నీ ప్రకృతి స్వాభావికంగా లభించే వెదురు , చెక్క , వస్త్రాలు మొదలైన వస్తువులతో తయారయిన గృహ అలంకరణ సామగ్రి దొరకుతాయి. వాల్ హేంగింగ్స్ ,పెయింటింగ్స్త , కొబ్బరి మొదలైన కాయలతో, పీచుతో తయారయిన అలంకరణ సామగ్రి , ప్రకృతి సిద్ధమైన వనమూలికల్తో తయారయిన కేశాలంకరణ నూనెలు, తేనె మొదలైనవి ఎన్నో ఇక్కడ అమ్ముతారు.
వెదురు, కొబ్బరి ఆకులు , చెక్కతో చేసిన బుట్టలు, టోపీలు , పెన్ స్టాండ్లు , డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొనే మాట్స్ మొదలైనవి .
నారతో చేసిన బాగ్స్ , పైనుంచి వేలాడ తీసుకొనేవి
ఇక్కడ ఊల్ తో చేసిన టోపీలు కూడా ఉన్నాయండోయ్
ఇవి ప్రకృతి సిద్ధమైన పదహారు రకాల వనములికలతో చెసినది. ఇందులో మామూలు కొబ్బరి నూనె పోసి నాలుగు రోజులు తరవాత శిరోజాలకు వాడితే చాల మంచిది అని అమ్ముతున్నారు.
ఇది ఎండి పోయిన కొబ్బరి బొండాం తో తయారు చేసిన కోతి బొమ్మ కళ్ళకు బదులు గాజు గోలీలను ఉపయొగిమ్చారు.
చెక్కతో చేసిన ఏనుగులు ఎంత సహజంగా ఉన్నాయో చూడండి .
ఇవన్నీ వ్యర్ధాల నుండి తయారు చేసిన బొమ్మలు . వాడి పారేసిన నట్లు, బోల్ట్ లు స్ప్రింగ్స్ , సైకిల్ ఊసలు మొదలైన పనికి రాని వస్తువులను కళాత్మకంగా తయారు చెసారు.
కామెంట్‌లు