పచ్చని ప్రకృతి ఒడి లోకి వెళదాం రండి
నిసర్గ్ ధామ్ లోనికి ప్రవేశించగానే మనకు నిజం గానే పచ్చని ప్రకృతి లోనికి వెళ్లి నట్లు ఉంటుంది . ఒక పక్కన గుబురుగా పెరిగిన పచ్చని చెట్లు , మరో పక్కన స్వాభావికమైన వాతావరణంలో పెరుగుతున్న లేళ్ళు , జింకలు , సాంబార్ లు , కుందేళ్ళు మనం అచ్చమైన అడవి తల్లి ఒడిలో ఉన్న భావం తప్పక కలుగు తుంది .
ఇవిగో లేళ్ళు
ఇది సాంబార్
రంగు రంగుల కుందేళ్ళు
ఈ జంతువులు అన్నింటికి అక్కడి సిబ్బంది సమయానికి ఆహారం ఏర్పాటు చేస్తున్నారు .
అంతే కాదు మనం అడవిలో నడచి అలసి పోతే సేద తీరడానికి చిన్న చిన్న వెదురుతో నిర్మించిన కుటీరాలు ఉన్నాయి. వెదురుతో చేసిన సోఫాలు గుండ్రంగా వేసి ఉన్నాయి. కాసేపు సేద దీరుదాం .
ఇక్కడ రకరకాల వ్యాధులకు ప్రకృతి సిద్ధమైన మూలికలతో వైద్యం చేసే ఆయుర్ ధామా అనే చికిత్సా కేంద్రం కూడా ఉంది .
కావేరి నది పాయ మీద వేసిన ఈ తాళ్ళతో చేసిన ఊగె వంతెన మీద వెళితే చాల బాగుంది .
ఎటు చూసినా పచ్చ దనమే
మనం కావాలనుకొంటే ఈ అడవిలో వుడ్ హౌస్ లో ఉండవచ్చును కూడా . ఇవి అద్దెకు ఇస్తారు .
గుబురుగా ఉన్న వెదురు పొదలు వంటరిగా వెళ్తే గుబులు పుట్టించేలా ఉన్నాయి కదూ !
వెదురు పొదల మధ్యలో ఈ ట్రీ హౌస్ కూడా ఉంది మనం కాసేపు దీని మీదకు ఎక్కి సేద తీరవచ్చు .
పిల్లలు , పెద్దలు సరదా పడే ఊయల కూడా ఏర్పాటు చేసారు .
కామెంట్‌లు