హలెబీడు


హలెబీడు  బేలూరు కు సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్ సౌకర్యం కూడా ఉంది. వెళ్ళే దారిలో 'జవగళ్' అనే ఊరు వుంటుంది. ఇది ప్రముఖ క్రికెటర్ జవగళ్ శ్రీనాద్ స్వగ్రామం . కర్ణాటకలో చాల గ్రామాలపేర్లె ఇంటి పేర్లుగా ఉంటాయి. ఉదాహరణకు సినీ నటుడు మెల్కోటే , సిరిశ్రి , కుంబ్లే ఇవన్నీ కూడా కర్ణాటక లోని గ్రామాల పేర్లే . బేలూరు, హలెబీడు రెండు కూడా అంతర్జాతియ నగల పెట్టె గా పేరు పొందినవి. బేలూర్ ను విష్ణు వర్ధనుడు నిర్మించగా ఆయన  మంత్రి హలెబీడు ను నిర్మించెను. బేలూరు విష్ణు దేవాలయం కాగా హలెబీడు శివాలయం . కాని ఆలయం పూర్తిగా నిర్మించ కుండానే మహమ్మదీయుల దండయాత్ర లు ఫలితంగా పూర్తి కాలేదు . మహమ్మదీయులు ఆలయాన్ని శిధిలం చేసారు. 







ఇది కూడా పూర్తిగా బేలూరు దేవాలయాన్ని నమునాగా తీసుకోని నిర్మించినదే . చాల మటుకు శిల్పాలు , అక్కడి వాలే ఉన్నాయి .




ఇక్కడ కూడా నాట్య మండపం నిర్మించారు . స్తంభాలు బేలూర్ ను పోలి వుంటాయి.


ఇక్కడ మంత్రి రెండు నందులను నిర్మించారు . ఒకటి రాజు నంది . మరొకటి రాణి నంది.


హలెబీడు దేవాలయ ప్రాంగణంలో శ్రావణ బెలగోళ లోని  బాహుబలి విగ్రహం నమున చెక్కి ఉంచారు.


బేలూర్ దేవాలయంలో విష్ణువు అవతారాలు చెక్క బడి ఉంటే ఇక్కడ నంది పై ఆసీనుడై యున్న శివ పార్వతులను మనం ఇక్కడ చూడ వచ్చును.

అదే విధంగా వినాయకుడి విగ్రహం కూడా దేవాలయం పక్కన చెక్కి ఉంచారు .


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం