గోల్డెన్ టెంపుల్ విశేషాలు చూడండి

గోల్డెన్ టెంపుల్ టిబెటన్ లకు చాలా పవిత్రమైన ప్రదేశం వారి ప్రార్ధనా సమయంలో తప్ప మిగిలిన సమయాలలో ఇతరులు ఎవరైనా లోనికి వెల్లవచ్చును. కాని నిశ్శబ్దం పాటించాలి . నిజానికి దేవాలయం లోపలే కాదు ఆ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగానే ఉండాలి . విశాలమైన పెద్ద హాల్ . పెద్ద ద్వారాలు మూడు ఉన్నాయి. మూడు ద్వారాలకు ఎదురుగా మూడు పెద్ద పెద్ద బంగారు విగ్రహాలు ఉంటాయి . అవి మధ్యలో బుద్దుడు, అటు, ఇటు శాక్యముని , పద్మసంభావుని విగ్రహాలు. వారు ఇరువురు బుద్ధుని అనుయాయులు. 


 హాల్ లో ఎక్కడ చూసినా ఆణువణువూ గోడలు, పై కప్పు తో సహా అన్ని చోట్ల బుద్ధుని జాతక కధలు, బుద్ధుని జీవిత చరిత్రను తెలిపే అనేక పెయింటింగ్స్ ఉంటాయి . అన్ని తైల వర్ణ చిత్రాలే .









 బౌద్ధుల పవిత్ర చిహ్నాలు గాజు పెట్టెలలో ఉమ్చ బడ్డాయి .


 పై కప్పు నుండి వేలాడుతూ పెద్ద పెద్ద షాండ్లియర్స్ ఉన్నాయి. వారి చిహ్నాలైన రంగు రంగుల వస్తాలు కూడా వేలాడ తీయబడి యున్నాయి .



  ఎక్కడ చూసినా రంగు రంగుల పువ్వుల కుండీలు అమర్చ బడి ఉన్నాయి.


వారి విగ్రహాల ఎదురుగ వారి గురించి వివరిస్తూ బోర్డ్స్ పెట్టి ఉన్నాయి.


 చక్కని ప్రశాంత మైన ఆ హాల్ నుంచి అసలు కదిలి రావాలని ఉండదు . అంత పవిత్రంగా , ప్రశాంతంగా అనిపిస్తుంది .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం