అలనాటి అందాలు
బేలూర్ దేవాలయంలో శిల్పులు సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఆనాటి కాలంలో ఉన్న సామాజిక పరిస్తితులు, ఆచార వ్యవహారాలూ, నాటి ప్రజల కట్టు బొట్టు , నిత్య జీవన వ్యవహారంలో వారి అలవాటులు అభిరుచులు అన్నింటిని ప్రతిబింబిస్తూ ప్రతి చిన్న వివరాలను ఎక్కడా మిస్ కాకుండా చెక్కిన విధానం గమనిస్తే మనకు వారి శ్రద్ధ , నైపుణ్యం మనకు కనిపిస్తుంది. ఈ క్రింది శిల్పం దర్పణ సుందరిగా ప్రసిద్ధిగాంచిన శిల్పం . ఆనాటి స్త్రీలు తమ సౌందర్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారని మనకు తెలుస్తుంది. వెనుక చెక్కిన లతలు మొదలైనావి అన్నీ కుడా చాలా సూక్ష్మ వివరాలు కనిపించేలా శ్రద్ధ పెట్టారు . ఆమె చేతిలోని అద్దం చూసుకొనే వైపు తెల్లగా వెనుక వైపు నల్లగా ఉండేలా చెక్కారు. ప్రతి శిల్పంలో ముఖ్య నాయకి అనుచరులు ఆమె పాదాల వద్ద ఆమెకు కావలసిన సామగ్రి అందిస్తూ మనకు కనిపిస్తారు.
నాటి కాలంలో మాతృస్వామ్యం ఎక్కువగా ఉండేదని మనకు తెలుస్తోంది . వేట , నిత్య కార్యక్రమాలలో స్త్రీ లకు ఎక్కువ ప్రాముఖ్యం ఉండేది . మగవారు వారికి అనుచరులుగా ఉండేవారని తెలుస్తుంది.
స్త్రీలు వేట కు వెళ్ళడం అది ఈ శిల్పంలో చూడవచ్చును ఆమె చేతిలో విల్లు ఆ నాటి స్త్రీలకూ అన్నీ విద్యలు వచ్చేవి అని మనకు తెలుస్తోంది.కొన్ని అపురూప శిల్పాల చేతులు మొదలైన భాగాలు ఆకతాయిలు విరిచేయడం జరిగింది . ఈ శిల్పంలో స్త్రీ నృత్యం చేస్తుంటే పక్కన అనుచరులు పక్క వాయిద్యాలతో ఆమెకు సహకరిస్తున్నారు. చూడండి.
ఆనాటి స్త్రీలు నృత్య,సంగితాలలో ప్రావీణ్యం కలిగి వుండేవారు. ఈ చిత్రంలో వాయిద్యాన్ని ఉపయోగిస్తున్న స్త్రీ మూర్తిని చూడండి.
స్త్రీ ఆదిపరాశక్తి గా అనేక చేతులలో వివిధ రకాల ఆయుధాలు ధరించి విశ్వ రూపం చూపగా మిగిలిన వారు ఆమెను కీర్తిస్తూ ఉన్న చిత్రాన్ని ఈ శిల్పం లో వివరంగా చెక్కారు.
ఆనాటి వివిధ జాతుల ప్రజల ఆకారాలు ఈ విధంగా చెక్కారు.
సప్తాశ్వాలు పూన్చిన రధంపై సూర్యనారాయణ స్వామి నిలువెత్తు విగ్రహం.
అడుగడుగునా శిల్ప చాతుర్యమే
చెన్నకేశవస్వామి స్వామి పాదముద్రలు
ప్రతి శిల్పం క్రిందన ఆ శిల్పాన్ని చెక్కిన శిల్పి వివరాలు ప్రాచిన కనడ భాషలో చెక్కి ఉంచారు.
నాట్య సుందరి.
అనంత పద్మనాభస్వామి
పార్వతిసమేతుడైన పరమేశ్వరుడు కొలువై ఉన్న కైలాస పర్వతాన్ని తలపై మోస్తున్న రావణాసురుడు .
తా వలచినది రంభ అన్నట్లుగా అనాకారి అయిన స్త్రీ మూర్తి ని చేరతిసిన పురుషుడు .
కామెంట్‌లు