ఆబ్బె వాటర్ ఫాల్స్ - మడికేరి
మడికేరి నుంచి దగ్గర లోని చూడ దగిన వాటర్ ఫాల్స్ అబ్బే వాటర్ ఫాల్స్ . కర్ణాటక లో నేను చూసిన ప్రదేశాలలో నాకు ఇక్కడ మాత్రమే ప్రవేశ రుసుము లేనిది కనిపించింది . వెహికిల్ పార్కింగ్ మాత్రం పది రూపాయలు తీసుకున్నారు . ఇక్కడ కు వెళ్ళే మార్గం చాలా ఎత్తు పల్లాలతో మెలికలు తిరిగి ఉంటుంది . అన్ని కొండలు, గుట్టలు . చుట్టూ కాఫీ తోటలు , కోకో తోటలు ఉంటాయి .
పార్కింగ్ లో వెహికిల్ పెట్టి చాలా కిందికి దిగాలి . కొంత దూరం మాములుగా దారి , కొంత దూరం మెట్లు ఉన్నాయి.
అదుగో వాటర్ ఫాల్స్ వచ్చేసింది . వేసవి కావడంతో మరీ ఎక్కువ నీళ్ళు పడటం లేదు కాని చాలా ఎత్తు నుంచి పడుతున్నాయి .
ఎక్కడి కక్కడ హెచ్చరికల బోర్డ్స్ పెట్టారు . ఇక్కడ ఒక తీగలతో చేసిన ఊగె వంతెన ఉంది దానిని దాటి అవతలకు వెళితే అడవి వస్తుంది . అక్కడికి మాత్రం ప్రవేశం లేదు .
ఇక్కడ అన్ని కాఫీ, కోకో, పనస మొదలైన చెట్లు ఉన్నాయి . అవి కోకో కాయలు . ఇక్కడ అన్ని అంతర పంటలు పండిస్తారు .
కాఫీ కాయలు కాశాయి ఇంకా లేతగా ఉన్నాయి .
ముదిరిన తరువాత ఇలా ఉంటాయి .
పెద్ద పెద్ద చెట్లు మీద పరాన్న జీవులుగా అనేక మొక్కలు పెరుగుతాయి.
ఈ మొక్క కాండం చూడండి వింతగా ఉంది కదా !
చూసారా ఎన్ని పనస కాయలో చెట్టు నిండా కాశాయి .
కామెంట్‌లు