కూర్గ్ - భూతల స్వర్గ్
మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కూర్గ్ అనేది ఒక ఊరు కాదు 'కొడగు' జిల్లా నే కూర్గ్ అంటారు . కూర్గ్ లేదా కొడగు జిల్లాకు ముఖ్య పట్టణం 'మడికేరి' . కొందరు దీనినే కూర్గ్ అంటారు . ఏమైనా కూర్గ్ జిల్లా అంతా వేసవి విడిది కేంద్రాలే . మండు వేసవిలో వెళ్ళిన మాకు నిజంగా అది భూతల స్వర్గం అనిపించింది అనడంలో అతిశయోక్తి కాదు. ఇక్కడికి బెంగుళురు నుంచి హసన్ మీదుగా మంగులుర్ హైవే మిద వెళ్లి కుశాల్ నగర్ నుంచి వెళ్ళ వచ్చును. లేదా మైసూర్ మీదుగా కూడా వెళ్ళవచ్చును .
ఇది మడికేరి ముఖ్య కూడలి .
ఇక్కడ నుంచి దగ్గర లోని సందర్శనీయ స్థలాల వివరాలు బోర్డ్ పై వ్రాసి ఉంచారు .
మడికేరి నుంచి చూడవలసినవి రాజా'స్ సిట్ అనే మంచి వ్యూ పాయింట్ , రాజు గారి కోట , అబ్బే వాటర్ ఫాల్స్ , ఓం కారేశ్వర్ గుడి మొదలైనవి చూడాలి . అయినా ఎటు చూసినా ఎత్తు పల్లాలతో కొండలు కోనలతో , పచ్చని చెట్లతో , దూరంగా బొమ్మరిళ్ళ లా కనిపించే ఇళ్ళతో చూడ ముచ్చటగా ఉంటుంది .
ఎక్కడ చూసినా కాఫీ, కోకో , కొబ్బరి మొదలైన తోటలతో నిండి కనువిందు చేస్తూ ఉంటుంది . చిన్న చిన్న అందమైన బంగాళా పెంకుటిళ్ళు ఉంటాయి .
కామెంట్‌లు