మడికేరి అందాలు

కూర్గ్ ముఖ్య పట్టణం మడికేరి లో మనం ముఖ్యంగా చూడవలసినవి చాలా ఉన్నాయి . అందులో రాజు గారి కోట , రాజుగారి సమాధి స్థలం , రాజాస్ సీట్ , దగ్గరలోని అబ్బే వాటర్ ఫాల్స్ ,  ప్రసిద్ధ నీల కం ఠీ స్వర స్వామీ గుడి , ఇక్కడికి నలబై కిలోమీటర్ల దూరంలోని కావేరి జన్మస్థలం తలకావేరి , త్రివేణి సంగమం భాగ్ మండల్ తప్పక చూడాలి . సుమారు తొంబై కిలోమిటర్స్ దూరంలో ఇరుపు వాటర్ ఫాల్స్ కూడా చూడ తగ్గదే . ముందుగా మడికేరి లోని ప్రదేశాలు చూసేద్దాం రండి . ఎక్కడ చూసినా అందాలే
టూరిజం ఎక్కువగా ఆదాయ వనరుగా ఉండటం వల్ల ఇక్కడ ప్రతిచోటా ఆ ప్రదేశంలో సందర్శిచే స్థలాల వివరాలు చక్కగా బోర్డ్స్ పెట్టి ఉంటాయి . 


రాజు గారి కోట ఇది . ప్రస్తుతం దీనిని ప్రభుత్వ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు .



మెలికలు తిరిగిన రోడ్లు , మబ్బులతో నిండి చల్లని వాతావరణం మనకు వదలి రావాలని ఉండదు . 




 


ఇది నీల కంఠెశ్వర స్వామీ దేవాలయం , చెరువు మధ్యలో చిన్న మండపం నిర్మించారు దేవాలయం కేరళ పద్ధతిలో కనిపిస్తుంది .


ఇది గద్దేగి అని పిలిచే రాజు గారి సమాధి స్థలం . 














కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం