సొగసు చూడ తరమా !
మేము వెళ్ళిన సమయం ఏప్రిల్ 2 7 నాటికి రాజగోపురానికి రంగులు వేసే పనిలో ఉన్నారు.
కనడ, హింది, ఇంగ్లీష్ లలో బేలూర్ నామ ఫలకం .
బేలూర్ దేవాలయంలోని ప్రతి అణువు ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది . ఇక్కడ మనకి తప్పనిసరిగా గైడ్ అవసరం ఉంటుంది .లేకపోతె మాములుగా చూసి వచ్చేసినట్లు ఉంటుంది. 2౦౦ రూపాయలు తీసుకోని మనకు దేవాలయపు ప్రత్యేకతను వివరంగా చెపుతాడు. ఇంగ్లీష్, హిందీ , కనడ లలో వివరిస్తాడు. కొద్దిగా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజ గోపురం దగ్గరలోనే మన సామాగ్రి భద్రపరచుకొనే అవకాశం ఉంది . రాజగోపురం ద్రావిడ శిల్ప కళా రీతిలో నిర్మించ బడింది. లోపలి వెళ్ళ గానే ద్వారానికి కుడి పక్కన లోతుగా నిర్మించిన ఒక తటాకం ఉంది.
మంచి ఎండ సమయంలో వెళ్ళాము . గుడి చుట్టూ తిరిగి చూడటానికి వీలుగా కార్పెట్ పరచి ఉన్నాయి. అందువలన కాళ్ళు కాలకుండా చూడటం జరిగింది.
దేవాలయం అంతా నక్షత్రాకారంలో నిర్మించబడి ఉంది. ముఖ ద్వారానికి ఇరువైపులా సింహపు శిల్పాలు రెండు ఉన్నాయి. అవి హోయసల రాజుల చిహ్నాలు.
దేవాలయం రెండు భాగాలుగా ఉంటుంది ముందు భాగం ముఖ మండపం వెనుక భాగం గర్భగుడి . ముఖ మండపం బయట అన్నీ జంతువులు, మానవుల బొమ్మలు చెక్కారు. గర్భగుడి బయట భాగం దేవతా మూర్తుల శిల్పాలు చెక్కారు . గైడ్ అది వివరిస్తూ గర్భగుడి భాగం పరమాత్మ ను మండపం భాగం జీవాత్మ ను సూచిస్తుంది . దేవాలయం జీవాత్మ , పరమాత్మ ల కలయికకి ప్రతిరూపం అని అన్నాడు.
ముఖ మండపం బయట భాగంలో కింది వరుసలో అన్నీ ఏనుగుల బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఇవి భారాన్ని అంత మోస్తాయని భావం. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏ ఒక్క ఏనుగు మరొక ఏనుగును పోలి ఉండదు . దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. ఏనుగుల వరుస పైన సింహాలు బొమ్మలు చెక్క బడి ఉన్నాయి.
ఏనుగుల వరుస పైన సింహాలు చెక్క బడి ఉన్నాయి ఇవి సాహసానికి, ధైర్యానికి ప్రతీక లుగా చెక్క బడ్డాయి. ఈ రెండు వరుసల పైన గుర్రాల బొమ్మలు చెక్క బడ్డాయి . పైన ఉన్న ఫోటో ను గమనిస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. గుర్రాలు వేగానికి, చురుకుదనానికి ప్రతీక గా చూపించారు అని గైడ్ వివరించాడు.
కామెంట్‌లు