కావేరీ నిసర్గ్ ధామ్ చూద్దాం రండి

కావేరీ నిసర్గ్ ధామ్ కుశాల్ నగర్ కి దగ్గర్లోని తప్పక చూడ వలసిన ప్రదేశం . ఇది కావేరి నది చేత చుట్ట బెట్ట బడిన ఒక చిన్న దీవి . ఇది అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చి దిద్దినది .  రోడ్ మీద దిగగానే రకరకాల షాప్స్ ఉంటాయి . లోపలి వెళితే మొత్తం అడవి దానినే చిన్న పెద్ద అందరికి ఆకర్ష నీయంగా తీర్చిదిద్దారు. 












కావేరి నది పాయ మీద చిన్న వంతెన దాటి వెళితే నిసర్గ్ ధామ్ లోనికి ప్రవేశించ వచ్చును . చాల స్వల్ప మొత్తం టికెట్ గ చెల్లించి లోపలి ప్రవేశించాము . ఇక్కడ కనిపించే ప్రతిది అడవిలో సహజ సిద్ధంగా దొరికేదే తయారు చేసారు . ఎదురుగా కనిపించే బోర్డ్ మొదలైన వన్నీ చెక్కతో చేసినవే . ఇక్కడ కూడా ప్లాస్టిక్ నిషేధం .

మరి అడవంతా తిరిగి చూద్దాం తదుపరి పోస్టు లో . తప్పక చూడండి . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం