చిట్కా ... చిట్కా ....

మనం రోజువారీ పనులలో కొన్ని సులువుగా అయిపోతే బాగుండును అని కాని , ఇలాటి పరిస్తితి వస్తే ఏమి చేయాలి అని కాని అనుకొంటూ ఉంటాము ఇది వరకు పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి . అన్ని ఉమ్మడి కుటుంబాలు కాబట్టి పెద్ద వాళ్ళు , అనుభవజ్ఞులు ఇలాటి సమయాలలో ఏదో ఒక చిట్కా చెప్పి ఇలా చేసుకో అని చెప్పెవారు. ఇప్పుడు వంటింట్లో చారు పెట్టాలన్నా రెసిపీ కోసం నెట్టింట్లో వెతకాల్సిన పరిస్తితి కదా ! అందుకే ఈ చిట్కాలు ఉపయోగ పడతాయి అనుకొంటే వాడేసుకోవడమే .

  1.  కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.


  2. రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.

  3. బెండకాయ, వంకాయ వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనె లో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.


  4. దోశ ల  పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.

  5. వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది.


  6. తరిగిన బంగాళ దుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై  వెనిగార్ చల్లితే చాలు.


   7. అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.

  
   8. వేడిచేసిన గరిటతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా తాజాగా ఉంటుంది.

   9. వెల్లుల్లిని ఫ్రిజ్  లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి,  పొట్టు కూడా సులువుగా వస్తుంది.

   10. క్యాబేజీ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం