బేలూర్ దేవాలయ విశేషాలు


ప్రధాన ద్వారానికి ఇరు పక్కలా మెట్లకు అటు ఇటు గరుడుడు ,హనుమంతుడు విగ్రహాలు చిన్న మందిరాలలో ఉన్నాయి. 

ఎండ సమయంలో గుడి చుట్టూ తిరిగి చూసేందుకు కాళ్ళు కాలకుండా ఇలా కార్పెట్ పరచి ఉంచడంలో టూరిజం పట్ల టూరిస్టు ల పట్ల వారు తీసుకొన్న శ్రద్ధ కనపడు తున్నది. 
గర్భగుడి బయట భాగంలో పలు దేవతా మూర్తులు, విష్ణువు యొక్క దశావతారములు మొదలగు శిల్పాలు చెక్కారు. 

 గర్భగుడి లోనికి గాలి ప్రసరించడానికి రాతిలోనే కిటికీలు చెక్కారు .


ముఖ్య ప్రవేశ ద్వారం పైన మకర తోరణం చెక్కారు ఇవి మూడు ద్వారాలకు మూడు ఉన్నాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే బయట వైపు దశావతారములు లోని ఘట్టం ఒకటి ఉంటే అదే రాతిలో లోపలివైపు మరో ఘట్టం చెక్కడంలో శిల్పి యొక్క నైపుణ్యం కనిపిస్తుంది . అంతేకాదు చిన్న చిన్న సూక్ష్మ మైన వివరాలు కూడా కనిపించేలా చెక్కిన వారి పని తనానికి జోహార్లు అర్పించాలి. 





దేవాలయంలో ప్రతి అణువు ఎదో ఒక శిల్పం చెక్కి అడుగు అడుగునా అందాలు ఏర్పరిచారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం