భాగ్ మండల్ - త్రివేణి సంగమం
మడికేరి కి సుమారు నలబై అయిదు కిలోమిటర్స్ దూరంలో భాగ్ మండల్ ఉంది . ఇక్కడ ప్రసిద్ది ఏమిటంటే ఇక్కడ కావేరి, కనికా , సుజోతి అనే మూడు నదులు కలుస్తాయి . దీనిని త్రివేణి సంగమంగా చెప్తారు.
ఇదే త్రివేణి సంగమం . మరి ఎక్కువ నీళ్ళు ఉండవు .
ఇక్కడ మరణించిన పెద్దలకు పితృ కార్యాలు , పిండ ప్రదానాలు చేస్తారు . బహుశా ఉత్తర భారతానికి చెందిన వాళ్ళు అనుకొంటా స్త్రీలు కూడా పాల్గొన్నారు .
ఇక్కడ కేరళ సాంప్రదాయంలో కట్టిన దేవాలయం ఉంది . ఇక్కడ చాలా మంది దేవతల గుళ్ళు ఉన్నాయి .
దేవాలయం అంతా చాలా పరిశుభ్రంగా ఉంది . ఇక్కడ నిత్యాన్నదానం చెస్తారు. కర్ణాటక లోని చాలా దెవాలయాలయాలో ఈ సంప్రదాయం ఉంది . భోజనం కూడా చాలా చక్కగా , వేడిగా ఉంది . అక్కడ ఒక పెద్ద డిబ్బి ఉంచారు . భోజనం చేసిన వారు తమకు తోచిన దానిని అందులో వేయవచ్చును . అది ఇలాగే మరి కొందరికి భోజనము ఉచితంగా పెట్టడానికి ఉపయోగపడుతుంది .
కామెంట్‌లు