"దుబారే ఎలిఫెంట్ కేంప్ " చూసారా?
కుశాల్ నగర్ లో మనం చూడవలసిన ప్రదేశం మరొకటుంది . అదే దుబారే ఎలిఫంట్ కేంప్ . ఏనుగులను వాటి సహజ వాతావరణంలో పెంచుతూ మనం వాటితో కలిసి ఉంటూ , వాటిపైకి ఎక్కి సవారి చేస్తూ , వాటికి ఆహారం తినిపిస్తూ , వాటిని స్నానం చేయిస్తూ ఆనందించవచ్చు .
కుశాల్ నగర్ నుంచి సుమారు పది కిలో మీటర్స్ వెళితే కావేరి నది దగ్గర ఈ ఎలిఫెంట్ కేంప్ ఉంది . ఇక్కడ దిగి నదిని దాటాలి . నదిని దాటడానికి బోట్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఏబై రూపాయలు టికెట్ . ఇక్కడ రాఫ్టింగ్ , స్విమ్మింగ్ , బోటింగ్ చెయవచ్చును. నది పాయను దాటితే మనం ఎలిఫెంట్ కేంప్ చేరవచ్చును .
నదీ విహారం చేస్తూ
ఇదిగో కేంప్ లోకి ప్రవేశించాము . ఇక్కడ ఉదయం 8 - 45 నుంచి సందర్సించ వచ్చును . ఏనుగును ఎక్కి సవారి చేయాలంటే పది గంటలనుంచి చెయాలి.
ఏనుగు సవారి కైనా , వాటికి మనం గడ్డి తినిపించాలన్నా , వాటికి మనం స్వయంగా స్నానం చేయించాలన్నా ప్రతి దానికి ఫీజ్ చెల్లిస్తే సరిపోతుంది . ఆ వివరాలు ఈ బోర్డ్ లో ఉన్నాయి చూడండి .
కరి రాజుల సరసాలు
మావటీలు ఏనుగుల మీద ఎక్కి వాటిని నది లోనికి తీసుకు వెలుతున్నారు.
ఏనుగులకు గడ్డిని చుట్టి ఉంచుతారు . వాటిని మనం డబ్బు చెల్లించి తీసుకోని స్వయంగా తినిపించవచ్చును .
ఇక్కడ ఉన్న ఏనుగుల పేర్లు , వాటి వయసులు బోర్డ్ పై ప్రదర్శిస్తున్నారు . ఇంద్ర , గౌరీ మొదలైన ఏనుగులు ఉన్నాయి . అన్నింటిలో చిన్నది నాలుగేళ్ల వయసు కలిగినది .
ఇంకా ఏనుగు సవారి , ఏనుగు తో ఫోటో లు మొదలైనవి తదుపరి పోస్టు లో చూడండి .
కామెంట్‌లు