కూర్గ్ లో వసతి
కూర్గ్ లో మనం ఒకటి రెండు రోజులు ఉండి అన్నీ చూడవచ్చును . ఇక్కడ మనకు అన్ని రకాల సదుపాయాలతో కూడిన వివిధ ఖరిదులలో గల వసతి సౌకర్యాలు లభిస్తాయి.
మాములుగా తక్కువలో కావాల్సిన హోటల్, మరియు లాడ్జి సౌకర్యాలు ఉన్నాయి .
మాములుగా తక్కువలో కావాల్సిన హోటల్, మరియు లాడ్జి సౌకర్యాలు ఉన్నాయి .
ఖరీదైన హోటల్స్ ఉన్నాయి .
హొమ్ స్టే లు ఉంటాయి . అంటే ఒక కుటుంబం తో పాటు మనకు కూడా వాళ్ళ ఇంట్లో వసతి కల్పిస్తారు . మనం మన బంధువుల ఇంటికి వెళ్లి ఉన్నట్లు గా అనిపిస్తుంది . వాళ్ళు చాలా చక్కగా మనకు సౌకర్యాలు , అతిది మర్యాదలు చేస్తారు . ఇక్కడ ఎక్కువగా ఈ విధంగా టూరిజం మీద ఆధార పది జీవించే కుటుంబాలు ఎన్నో ఉంటాయి . వాళ్ళ ఇళ్ళను చక్కగా తీర్చి దిద్ది ఉంచుతారు .
అదే విధంగా విల్లాస్ కూడా అద్దెకు దొరకుతాయి మనకు కావలసినన్ని రోజులు ఉండ వచ్చును ఇక్కడ మనకు ఇంట్లో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఉంటాయి .
కాఫీ ఎస్టేట్స్ లో కూడా మనకు వసతి లభిస్తుంది ఉరికి దూరంగా ప్రకృతి ఒడిలో ఎస్టేట్ లో ఉండవచ్చును . ఇది కొంచెం ఖరీదైన వ్యవహారం . కాని కొన్ని రోజులు ప్రపంచానికి దూరంగా ఉండాలని అనుకొనేవారికి చాలా అనువైనది.
అవే కాకుండా వివిధ రిసార్టులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు మసాజ్ కేంద్రాలు , స్పాలు , ఆట పాటలకు అనువైన వసతులు ఎన్నో ఉన్నాయి .
కామెంట్‌లు