ఇండోర్ ప్లాంట్స్ ఉపయోగాలెన్నో








ప్రకృతి ప్రసాదించిన పచ్చదనం మానవ చర్యల వల్ల తరిగిపోతోంది. ఫలితంగా వాతావరణం కలుషితమైపోతోంది. దీంతో మనుషులు అనేక రకాల అనారోగ్యాలకు లోనవుతున్నారు. నాలుగు గదుల మధ్య ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపేవారు కాలుష్యాల వల్ల త్వరగా
లసిపోతారు. మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు సజావుగా  చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఆఫీసులో మనస్సుకు ఆహ్లాదం ఉత్తేజం కలిగించేందుకు పచ్చని మొక్కలు, పుష్పాలు అవి అందించే సువాసనలు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి. బయటి వాతావరణం కంటే ఆఫీసుల్లో సరైన గాలి, వెలుతురు రాకపోవడం వల్ల కాలుష్యం 5రెట్లు పెరుగుతుందని న్యూయార్క్కు చెందిన ఇంటిగ్రేటివ్మెడిసిన్ఫిజిషియన్జేమ్స్డిల్లార్డ్‌. 'ప్లాంట్స్వై. యు కెనాట్లివ్విత్దెమ్పుస్తకరచయిత బిల్ఓల్వ్టర్న్లు తెలియజేస్తున్నారు. ఐతే మొక్కలైతే ఎక్కువ ఉపయోగంగా ఉంటాయో వారు వివరించారు. ఏవి ఎంచు కోవాలనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. గదిలోకి సూర్యకిరణాలు, వెలుతురు మేరకు వస్తుంది. గది రంగు తదితర అంశాలను పరిశీలించి నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు. మొక్కల పెంపకం కేంద్రానికి వెళ్ళి మనకు కావలసిన మొక్కలను ఎంచుకుని ఆఫీసుల్లో కుండీలలో పెంచుకోవడం ద్వారా పచ్చదనం నింపుకోవాలి. ఏఏ మొక్కలు ఎంతెంత ఉపయోగమో తెలుసుకుందామా మరి!మనస్సుకు ఆహ్లాదం ఉత్తేజం కలిగించే ఇండోర్ మొక్కలు
1. ఆర్ కె పామ్స్ 
‌ (పోకమొక్క): మొక్క 6 అడుగుల వరకు పెరుగుతుంది.  దాదాపు 60 పచ్చని ఆకులతో కూడిన కొమ్మలు మొక్కకు పెరుగుతాయి. ప్రత్యేకించి ఆకులు గాలి ద్వారా వచ్చే రేణువు లను  పీల్చుకుంటాయి. ఫలితంగా గాలిలో ధూళిరేణువుల  వల్ల కలిగే అనారోగ్యం నుంచి కాపాడుకోవచ్చు
2. పుదీన: పుదీనా ఆకు మనకు బాగా తెలిసిందే. ఆకును మనం అనేక వంటకాల్లో ఉపయోగించుకుని శారీరక ఆరోగ్యాన్ని పెంచుకుంటాము. పుదీనతో చట్నీ చేసుకుని ఆరగించి ఆనందిస్తాము. పుదీన ఆకులు నుంచి వచ్చే సువాసన జాగరూకతను, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఆకలి మందగించినప్పుడు పుదీనతో వంటకం ఆకలిని పుట్టిస్తుంది. పుదీన చట్నీ, పొడిలాంటివి చేసుకొని ఎంతో ప్రయోజనం పొందవచ్చు. ఆఫీసుల్లో పుదీన మొక్కలను పెంచడం వల్ల గది అంతా సువాసనతో నింపుకోవచ్చు. ఇది ఎత్తు పెరగదు
3.
ఇంగ్లీషు ఐవి (ఒక విధమైన తీగ):  మొక్క తీగలాగా ఉండి చివర ఆకు లుంటాయి. ఆఫీసుల్లో ప్రత్యేకించి వివిధ రకాల ఫ్యాక్టరీల్లో యంత్రాలు విడుదల చేసే కాలుష్యం, ధూళి రేణువులు  తలనొప్పిని, తీవ్ర అలసటను కలిగిస్తాయి. మొక్క అలాంటి కాలుష్యాలను, అలాగే జ్వలిత గుణం గల రసాయనాల సమ్మేళనాలను కూడా పీల్చుకుంటుందని జార్జియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి వెల్లడించారు
4.
లెమన్బామ్‌: లెమన్బామ్‌ (నిమ్మ) నుంచి వచ్చే సువాసన మనిషి మూడ్ను మెరుగుపరుస్తుందని ఒహియో స్టేట్యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది. అలాగే మెదడులో మనిషి మూడ్ను, ప్రవర్తనను సరైన దిశలోకి తీసుకొచ్చే నొరిపిన్ఫ్రఙన్అనే రసాయనం పరిమాణం పెరుగుతుందనీ తెలిపారు. ఎవరికైనా వికారంగా ఉన్నప్పుడు నిమ్మకాయ వాసన చూడమని పెద్దవాళ్ళు చెపుతుంటారు. దాని వాసన చూస్తే వికారం తగ్గి మామూలు స్థితికి వస్తారు
5.
మనీప్లాంట్‌: గదిలోపల ఓజోన్పరిమాణాన్ని మనీప్లాంట్తీగవాసన తగ్గిస్తుందని, ఓజోన్‌ (ప్రాణవాయువ్ఞ ఘనీభూత రూపం) తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ ఛాతీనొప్పి, గొంతులో ఇబ్బంది వంటివి ఉంటాయని పరిశోధకులు తెలిపారు
6.
గార్డీనియ (పెద్ద తెల్లటి లేదా పసుపు పూలు పూస్తాయి): మనోవ్యాకులతను తొలగించే గుణం మొక్క నుంచి వెలువడే వాసనకు ఉంది. ఇది ఇరవై అయిదు సంవత్సరాలు జీవిస్తుంది. మొక్క పూలపు వాసన చూస్తే మానసిక ఉల్లాసం కలుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. రట్జర్స్యూనివర్శిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం